Homeటాప్ స్టోరీస్బోయపాటి ఏమాత్రం మారలేదుగా

బోయపాటి ఏమాత్రం మారలేదుగా

Boyapati Srinu about Balayya film
Boyapati Srinu about Balayya film

టాలీవుడ్ లో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. ఒకరు క్లాస్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడితే ఒకరు మాస్ జపం చేస్తుంటారు. ఒకరు కామెడీ సినిమాల వైపు చూస్తే ఒకరి సమాజానికి మెసేజ్ ఇవ్వడమే లక్ష్యంగా బిహేవ్ చేస్తారు. అలా బోయపాటికి కూడా ఒక శైలి ఉంది. వీర లెవల్ మాస్ హీరోయిజాన్ని చూపించడంలో బోయపాటి రూటే సెపరేటు. ఈయన సినిమాల్లో హీరోయిజం కొంచెం అతిగానే ఉంటుంది. ట్రైన్ మీద నిలబడి వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయడం, కార్ ను అమాంతం ఒక చేత్తో ఎత్తేయడం, తల నరికితే గద్దలు క్యాచ్ పట్టడం, ఒక మనిషి ఒక రూమ్ లో దాదాపు రెండు దశాబ్దాలు గడిపేయడం.. ఇలా ఎన్నో వింతలు బోయపాటి సినిమాల్లో ఉంటాయి. ఒక్కోసారి అవి వర్కౌట్ అయిపోయి ప్రేక్షకుల దృష్టి నుండి తప్పించుకుంటాయి. కానీ వినయ విధేయ రామ లాంటి సినిమాలు చేసినప్పుడు జనం చేసే ట్రోల్స్ నుండి తప్పించుకోలేరు.

బోయపాటి తీసిన వినయ విధేయ రామ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ చిత్రం పరాజయం మాట అటుంచితే జనాలు ఎగబడి మరీ ట్రోల్స్ చేసారు. హీరోయిజం పేరుతో బోయపాటి విన్యాసాలు ప్రేక్షకులను ఎంజాయ్ చేసేలా చేసాయి. అయితే ఈ ట్రోల్స్ ను బోయపాటి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అసలు ఈ సినిమా ప్లాప్ అన్నది కూడా బోయపాటి ఒప్పుకోవట్లేదు. నిజానికి ఈ చిత్రం మేకింగ్ సమయంలోనే రామ్ చరణ్ కు ఈ ఫలితంపై ఒక క్లారిటీ వచ్చేసింది. కొన్ని సన్నివేశాలపై సందేహాలు వ్యక్తం చేసినా ప్రేక్షకులు తన సినిమాల నుండి ఇలాంటివే ఆశిస్తారు అన్నట్లుగా బోయపాటి మాట్లాడడంతో చరణ్ కూడా ఎక్కువ ఏం ప్రశ్నించలేదు. పైగా అతను అగ్ర దర్శకుడు కూడా. అందుకే తనను నమ్మి సినిమా చేసాడు. అయితే ఫలితం మాత్రం తను ఆశించినట్లే వచ్చింది.

- Advertisement -

అయితే బోయపాటి మాత్రం వినయ విధేయ రామ మరీ అంత చెత్త సినిమా కాదనే అంటున్నాడు. ఈ చిత్రానికి దాదాపు 60 కోట్ల షేర్ వచ్చిందని, బడ్జెట్ ఎక్కువవ్వడం వల్లే ఫెయిల్ అయింది తప్ప కంటెంట్ తో ఎలాంటి సమస్యలు లేవని బోయపాటి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించాడట. పైగా వినయ విధేయ రామ ప్లాప్ తో తన రూట్ ఏం మారిపోదని, ఇలాంటి సినిమాలే తీస్తానని, ఈసారి బాలకృష్ణతో చేయబోయే చిత్రానికి మరింత పకడ్బందీగా స్క్రిప్ట్ కుదిరిందని, మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఈ చిత్రంతో అందుతాయని అంటున్నాడు బోయపాటి. ఒక డిజాస్టర్ తీసినా బోయపాటి కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గకపోవడం అభినందించదగ్గ విషయమే. మరి చూడాలి బాలయ్య సినిమాను ఎలా తీర్చిదిద్దుతాడో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All