Homeటాప్ స్టోరీస్లక్ ఉంటే సరిపోదు స్టఫ్ కూడా ఉండాలి - బాబీ

లక్ ఉంటే సరిపోదు స్టఫ్ కూడా ఉండాలి – బాబీ

లక్ ఉంటే సరిపోదు స్టఫ్ కూడా ఉండాలి - బాబీ
లక్ ఉంటే సరిపోదు స్టఫ్ కూడా ఉండాలి – బాబీ

దర్శకుడు బాబీ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ డైరెక్టర్ గా అవతరిస్తున్నాడు. పవర్ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన బాబీ, రెండో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నాడు. పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చేయగా అది అంతగా ఆడలేదు. అయినా కానీ ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ సినిమాతో బాబీ మళ్ళీ తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను మూడు భిన్న పాత్రల్లో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక క్రితం ఏడాది వెంకటేష్, నాగచైతన్యలను మామాఅల్లుళ్లుగా తెరపైన చూపించిన వెంకీ మామ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు బాబీ.

ఇటీవలే చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ బాబీతో ఒక సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు. ఇదే విషయమై బాబీని ఇంటర్వ్యూలో పలకరించి వరసగా టాప్ హీరోలతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ నే డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఇంత త్వరగా ఈ అవకాశం రావడాన్ని లక్ అనుకోవచ్చా అని ప్రశ్నించగా దానికి బాబీ మాట్లాడుతూ ఇండస్ట్రీలో కేవలం లక్ ఉంటేనే సరిపోదు. దానికి తగ్గ స్టఫ్ ఉండాలి. అది లేకపోతే ఎవరూ ఏం చేయలేరు.

- Advertisement -

ముందుగా రవితేజ గారు నాలోని టాలెంట్ ను గుర్తించి సినిమా అవకాశమిచ్చారు. అప్పటినుండి టాప్ హీరోలు అందరూ నాపై నమ్మకాన్ని ఉంచుతున్నారు. నేను కూడా వాటిని నిలబెట్టుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం చిరంజీవి గారి కోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాను. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్నా స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. అభిమానులు అందరూ ఖుషీ అయ్యే విధంగా సినిమా ఉంటుంది అని తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All