Homeఎక్స్ క్లూసివ్శ్రీ‌దేవితో తొలిసారి పోటీప‌డాల్సి వ‌చ్చింది - చిరంజీవి

శ్రీ‌దేవితో తొలిసారి పోటీప‌డాల్సి వ‌చ్చింది – చిరంజీవి

శ్రీ‌దేవితో తొలిసారి పోటీప‌డాల్సి వ‌చ్చింది - చిరంజీవి
శ్రీ‌దేవితో తొలిసారి పోటీప‌డాల్సి వ‌చ్చింది – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, శ్రీ‌దేవి క‌ల‌యిక‌లొ వ‌చ్చిన చిత్రం `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి`. కె. రాఘ‌వేంద్రావు తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈ చిత్రం విడుద‌లై నేటికి 30 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం గురించి, ఈ చిత్రంలో శ్రీ‌దేవితో కలిసి న‌టించ‌డం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చిరంజీవి అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

ఈ చిత్రంలో దేవ‌క‌న్యగా ఆమెను త‌ప్ప మ‌రొక‌ర‌ని ఊహించుకోలేము. శ్రీ‌దేవి లేనిదే ఈ సినిమా లేదు. ఈ పాత్ర ఆమె కోస‌మే సిద్ధ‌మైందా అనిపిస్తుంది. అంద‌చందాల‌తో, హోయ‌లు, చిల‌క‌పుల‌కుల‌తో మెస్మ‌రైజ్ చేసింది. అత్య‌ద్భుతంగా న‌టించింది. డ్యాన్సుల్లో ఏమాత్రం ఏమ‌ర‌పాటుగా వున్నా త‌న అంద‌చందాల‌తో హోయ‌ల‌తో త‌న పాత్ర‌ని ఎక్క‌డ తినేస్తుందోన‌ని తాను శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని ఆనాటి సంగ‌తుల్ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

చిరంజీవి ప్ర‌స్తుతం `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. లాక్‌డౌన్ త‌రువాత త‌దుప‌రి ప‌రిణామాల‌ని బ‌ట్టి షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్లాన్ చేస్తున్నార‌ట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All