Homeటాప్ స్టోరీస్ఎవ‌ర్ క్లాసిక్ సినిమా ఇది - చిరంజీవి

ఎవ‌ర్ క్లాసిక్ సినిమా ఇది – చిరంజీవి

ఎవ‌ర్ క్లాసిక్ సినిమా ఇది - చిరంజీవి
ఎవ‌ర్ క్లాసిక్ సినిమా ఇది – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి క‌లిసి న‌టించిన చిత్రం `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి`. కె. రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వ‌నీద‌త్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ నెల 9తో ఈ చిత్రం విడుద‌లై స‌రిగ్గా 30 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి.

ఈ సంద‌ర్భంగా హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోవ‌బోతుండ‌టంపై ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఇలాంటి అద్భుత చిత్రంలో న‌టించ‌డం త‌న‌కు ద‌క్కిన అదృష్టంగా భావిస్తున్నాన‌ని వెల్ల‌డించారు. తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో చెప్పుకోద‌గ్గ 25 బ్లాక్ బ‌స్ట‌ర్‌ల లిస్ట్‌లో ఈ సినిమా నిలిచిపోతుంద‌ని తెలిపారు.

- Advertisement -

`జ‌గదేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి` చిత్రం 30 ఏళ్లు పూర్తి కావ‌స్తున్న ఈ శుభ ‌త‌రుణంలో ఈ సినిమాపై సంబంధం అనుబంధం వున్న ప్ర‌తీ ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క శుభాభినంద‌న‌లు తెలుపుతున్నాను. సినిమా అనేది స‌మిష్టికృషి ఫ‌లితం అని  అన‌టానికి ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ `జ‌గదేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి`. ఈ సినిమాలో ప్ర‌తీ ఒక్క‌ళ్లు.. ప్ర‌తీ టెక్నీషియ‌న్‌, ప్ర‌తీ న‌టీన‌టులు, వాళ్ల వాళ్ల ప్ర‌తిభ‌ని క‌న‌బ‌స్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావ‌డానికి ఇది ఒక క్లాసిక్ కావ‌డానికి కృషి చేశారు. తెలుగు సినీ చ‌రిత్ర చూసుకుంటే గ‌న‌క అందులో టాప్ 25 మూవీస్‌లో ఇది చోటు ద‌క్కించుకునేంత గొప్ప సినిమా ఇది. ఇదొక టైమ్ లెస్ మూవీ. దీనికి జ‌న‌రేష‌న్ గ్యాప్ అనేది లేదు. పాత త‌రం, కొత్త త‌రం సినిమా అని చెప్పే అవ‌కాశ‌మే లేదు. ఇదొక ఎవ‌ర్ క్లాసిక్ సినిమా. ఇలాంటి సినిమాలో నాకు న‌టించే అవ‌కాశం రావ‌డం నా న‌ట జీవితంలో నాకు ద‌క్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను` అన్నారు చిరంజీవి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All