Homeటాప్ స్టోరీస్“పవర్” ఫుల్ క్రియేటర్ – డైరెక్టర్ బాబీ

“పవర్” ఫుల్ క్రియేటర్ – డైరెక్టర్ బాబీ

“పవర్” ఫుల్ క్రియేటర్ – డైరెక్టర్ బాబీ
“పవర్” ఫుల్ క్రియేటర్ – డైరెక్టర్ బాబీ

చూడటానికి తెల్లగా, బుగ్గలేసుకుని హన్సిక తమ్ముడిలా ఉంటాడు కానీ, పనిలోకి దిగాడంటే మాత్రం సంతోష్ రవీంద్ర కొల్లి అనబడే బాబి; ఎదో వరి పొలంలో నాట్లు వేస్తున్నట్లు, ఇటుకలు పేర్చి గోడ కడుతున్నట్లు చాలా శ్రద్ధగా సినిమా చేసేస్తాడు. ఇండస్టీ కి వచ్చిన మొదట్లో బాబీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరియు దశరథ్ ల వద్ద శిష్యరికం చేశాడు. మోహన్ బాబు, ఛార్మీ జంటగా కలిసి నటించిన పొలిటికల్ రౌడీ సినిమాలో దర్శకత్వ శాఖలో పని చేశాడు బాబీ. తర్వాత కొన్ని సినిమాల తరువాత, వరుసగా గోపీచంద్ మలినేని తో డాన్ శీను, బాడీగార్డ్ బలుపు సినిమాలకు వర్క్ చేశాడు. ప్రభాస్ తో డైరెక్టర్ దర్శకుడు తెరకెక్కించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా రచనా పరంగా సహకారం అందించాడు బాబీ. ఇండస్ట్రీకి ఎప్పుడు కొత్త టాలెంట్ ఉన్న వ్యక్తులను బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా పరిచయం చేసే, మాస్ మహారాజా రవితేజ బాబీ లో ఉన్న టాలెంట్ ని గుర్తించి అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. అలా డైరెక్టర్ బాబీ 2014లో రవితేజ హీరోగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత గా “పవర్” అనే ఒక పోలీస్ ఆఫీసర్ కథను సినిమాగా తీశాడు.
· “బెంగాల్ టైగర్ ఎక్కడో లేదు సార్ కలకత్తా కాళీ ఘాట్ లో డ్యూటీ చేస్తోంది.”
· “ఇక్కడ 100 కొడితే ఏ ఏ పోలీసోడు రావట్లేదు వంద రూపాయలు ఇస్తేనే వస్తున్నాడు” అన్న డైలాగులతో పాటు రవితేజ మార్క్ యాక్షన్ కామెడీ అందరినీ ఆకట్టుకున్నాయి.

వినోదానికి వినోదం హీరోయిజానికి హీరోయిజం రెండూ కలగలిపి ఆ సినిమా విజయం సాధించింది. ఆ సినిమా విజయంతో బాబీ రెండో సినిమాగా నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత ప్రాజెక్ట్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ దక్కించుకున్నాడు. ఇక దర్శకత్వం, రచన తోపాటు అన్ని విభాగాల్లోనూ పవన్ కళ్యాణ్ జోక్యం ఉన్నా కూడా; దర్శకుడిగా బాబీ సక్సెస్ అయ్యాడు అని అందరూ మెచ్చుకున్నాడు.

- Advertisement -

కళ్యాణ్ రామ్ తో గతంలో ఓం సినిమాకు వర్క్ చేసిన డైరెక్టర్ బాబి ఆ పరిచయంతో వెంకయ్య గారి జూనియర్ ఎన్టీఆర్ కు జై లవకుశ అనే సబ్జెక్ట్ చెప్పగా జూనియర్ ఎన్టీఆర్ ఆ మూడు పాత్రలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళాడు. ముఖ్యంగా ప్రతినాయక ఛాయలున్న జై పాత్ర అయితే టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రస్తుతం “వెంకీ మామ” తో మళ్ళీ మరొక బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ బాబీ స్పెషాలిటీ ఏమిటంటే, తను చేసే పనిలో ఎన్నో ఛాలెంజ్ లు ఎదురైనా, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, వెంకటేష్, నాగ చైతన్య లాంటి పెద్ద పెద్ద స్టార్లతో పనిచేస్తున్నా ఏ మాత్రం ఆందోళనకి గురి అవకుండా చాలా నెమ్మదిగా ,సహనంతో అనుకున్న పని అనుకున్నట్లు చేస్తాడు. డైరెక్టర్ బాబీ ఇలానే మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ, “ఆకాశంలో వచ్చేది మెరుపు – డైరెక్టర్ బాబీ అరుపు” అని ముగిస్తున్నాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All