
స్టాన్ హీరోయిన్ శృతిహాసన్‌పై బీజేపీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళితే..మంగళవారం తమిళనాడుతో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమల్‌హాసన్ మక్కల్‌నీది మయ్యిమ్ పార్టీపై కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్‌హాసన్ తన ఇద్దరు కూతుళ్లు వృతిహాసన్, అక్షర హాసన్‌లతో కలిసి చెన్నైలో ఓటు వేసిన ఆయన ఆ తరువాత తను కంటెస్ట్ చేస్తున్న కోయంబత్తూర్‌లోని ఓ పోలింగ్ బూత్‌కి వెళ్లారు.
అక్కడికి వెళ్లిన కమల్ పోలీంగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో శృతిహాసన్, అక్షర హాసన్ కూడా వున్నారు. అయితే శృతిహాసన్ కోయంబత్తూర్‌లోని పోలింగ్ కేంద్రంలోకి తండ్రి కమల్‌తో కలిసి అక్రమంగా సందర్శించారని బీజేపీ వర్గాలు ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. శృతిహాసన్ అక్రమంగా పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకుని వెళ్లిందని ఆమెపై క్రిమినల్ కేసుని నమోదు చేయాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాస్ తరుపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శృతిహాసన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు తప్ప ఇతరులు వెళ్లరాదనే నిబంధన వుందని, కానీ ఈసీ నిబంధనను ఉల్లంఘించిన శృతిహాసన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.