Homeటాప్ స్టోరీస్నా వ‌ర్క్‌పైనే ఫోక‌స్ చేస్తే మంచిది :  శృతిహాస‌న్‌

నా వ‌ర్క్‌పైనే ఫోక‌స్ చేస్తే మంచిది :  శృతిహాస‌న్‌

నా వ‌ర్క్‌పైనే ఫోక‌స్ చేస్తే మంచిది :  శృతిహాస‌న్‌
నా వ‌ర్క్‌పైనే ఫోక‌స్ చేస్తే మంచిది :  శృతిహాస‌న్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ న‌టించిన హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన శృతిహాస‌న్ మ‌రోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ద‌క్కించుకుని త‌న‌ది గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది.

ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ ఆనందంలో వున్న శృతిహాస‌న్ రెట్టించిన ఉత్సాహంతో తాజాగా ప్ర‌భాస్ స‌ర‌స‌న `సలార్‌`లో న‌టించే గోల్డెన్ ఛాన్స్‌ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే శృతి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొత్త బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమ‌లో ప‌డింది అంటూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌పై తాజాగా శృతి స్పందించింది. ఇండ‌స్ట్రీలో వున్న ప్ర‌తీ ఒక్క‌రికీ వ్య‌క్తిగ‌త, వృత్తి ప‌రమైన జీవితాలుంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -

ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చ‌టించిన శృతి ప్ర‌స్తుతం తాను `స‌లార్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నాన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు తాను న‌టించిన చిత్రాల్లో ఇది చాలా భిన్న‌మైన‌ద‌ని వెల్ల‌డించింది. ఇంత‌కు మించి `స‌లార్` గురించి ఏమీ చెప్ప‌లేన‌ని, ఇందులో తొలిసారి ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించడం ఆనందంగా వుందని తెలిపింది. ప్ర‌భాస్ మంచి మ‌న‌సుతో పాటు వృత్తి ప‌రంగా నిబ‌ద్ధ‌త‌గ‌ల వ్య‌క్తి అని స్ప‌ష్టం చేసింది. ప్ర‌ముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంత‌ను హ‌జారికాతో శృతి ప్రేమ‌లో వుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా స్పందించింది. `వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడ‌టం నాకు ఇష్టం వుండ‌దు. ప్ర‌స్తుతం నా ఫోక‌స్ మొత్తం వ‌ర్క్ పైనే. కాబ‌ట్టి ఎదుటి వారు కూడా నా వ‌ర్క్‌పైనే ఫోక‌స్ చేస్తే మంచిది` అని శృతిహాస‌న్ వెల్ల‌డించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All