
కరోనా మహమ్మారి సెలబ్రిటీలని వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రతీ ఒక్కరినీ కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడిన సెలబ్రిటీలు కొంత మంది కోలుకోగా మరి కంత మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కొంత మంది హోమ్ ఐసోలేషన్‌లో వుండి డాక్టర్ల సూచనల మేరకు మెడిసిన్ వాడుతున్నారు. ఇదిలా వుంటే తాజాగా మరో సెలబ్రిటీ కరోనా బారిన పడినట్టు తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి తాజాగా కరోనా బారిన పడినట్టు తెలిసింది.
వి6 ఛానల్ ద్వారా `తీన్ మార్ వార్తలు` ప్రోగ్రామ్‌తో వెలుగులోకి వచ్చిన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి ఆ తరువాత ఆ ఛానల్‌ని వీడి టీవి 9కి మారిన విషయం తెలిసిందే. ఓ ఎపిసోడ్‌లో తన తండ్రి ఫొటోని వాడిన కారణంగా ఛానల్ యాజమాన్యానికి బిత్తిరి సత్తికి మధ్య వివాదం మొదలైంది. దాంతో ఆయన టీవి 9 ని వీడాల్సి వచ్చింది. అక్కడి నుంచి సాక్షి టీవికి మారిన బిత్తిరి సత్తి `గరం గరం` ప్రోగ్రామ్‌తో మళ్లీ వార్తల్లో నిలిచారు.
కరోనా కారణంగా అత్యంత తక్కువ మంది సిబ్బందితో ప్రోగ్రామ్‌ని కంటిన్యూ చేస్తున్న బిత్తరి సత్తి తాజాగా కరోనా బారిన పడటంతో సైలెంట్‌గా హోమ్ క్వారెంటైన్‌కి వెళ్లిపోయారట. గత కొన్ని రోజులుగా ఇంట్లోనే వుంటూ బిత్తిరి సత్తి చికిత్స పొందుతున్నారని, త్వరలోనే కోలుకుని మళ్లీ గరం గరం వార్తలతో వీవర్స్‌ని ఆకట్టుకుంటారని అంతా ఆశభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.