
చేవెళ్ల రవి.. అలియాస్ బిత్తిరి సత్తి. తెలంగాణ గ్రామీణ భాషలో అచ్చ తెలుగు పల్లె పదాలతో ఆకట్టుకుని స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి. తన ప్రోగ్రామ్‌తో ఓ ఛానెల్‌నే పాపులర్ చేసిన సత్తి ఆ తరువాత తన క్రేజ్‌ని ఖండాంతరాలకు చేరుకునేలా చేశాడు. తన ప్రోగ్రామ్ నచ్చి వివిధ దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు బిత్తిరి సత్తిని సొంత ఖర్చులతో విదేశాలకు తీసుకెళ్లి అక్కడ పలు వేదికలపై పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
V6 ఛానల్ లో తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ ద్వారా బిత్తిరి సత్తిగా పాపులర్ అయిన చేవెళ్ల రవి అక్కడి నుంచి టీవి 9కు లక్ష రూపాయల సాలరీతో మారిన విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లాక అతని ఫ్రీడమ్ పోయిందని చెబుతున్నారు. అతన్ని తగ్గించి మిగతా వాళ్లకు తమ ప్రోగ్రామ్‌లో ప్రాధాన్యం కలిగించడం, సత్తికి నచ్చకపోవడం, ఫాదర్స్‌డే సమయంలో సత్తి తన ఫాదర్ ఫొటోని చూపించి అతని గొప్పదనం గురించి చెప్పడం టివి9 యాజమాన్యానికి నచ్చలేదట. ఆ కారణంగానే సత్తిని ఛానల్ నుంచి పంపించారని తెలిసింది. తాజాగా సాక్షి టీవిలోకి సత్తి ఎంటరైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తొలి ప్రోమో వదిలిన బిత్తిరి సత్తి టివి9 నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా బయటపెట్టి అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. తండ్రిని గౌరవించే ఛానల్ ఇది. ఇక ఇక్కడ తనకు తిరుగులేదని, జనం తన గుండెల్లో చోటిచ్చారని. ఇక గుండీలు విప్పి తన సత్తా ఏంటో చూపిస్తానని తొలి ప్రోమోతో పంచ్‌ల పర్వానికి తెరలేపడం ఆసక్తికరంగా మారింది.