Homeగాసిప్స్కొత్త అవ‌తారంలో బిత్తిరి స‌త్తి !

కొత్త అవ‌తారంలో బిత్తిరి స‌త్తి !

కొత్త అవ‌తారంలో బిత్తిరి స‌త్తి !
కొత్త అవ‌తారంలో బిత్తిరి స‌త్తి !

బిత్తిరి స‌త్తి.. తీన్మార్ వార్త‌ల‌తో ఓ ఛాన‌ల్‌కి మెయిన్ ఎస్సెట్‌గా మారిన పేరిది. విల‌క్ష‌ణ‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌, తెలంగాణ గ్రామీణ యాస‌కు త‌న‌దైన మార్కుని జోడించి చేవెళ్ల ర‌వి అలియాస్ బిత్తిరి స‌త్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలంగాణ‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు బిత్తిరి స‌త్తి. త‌ను ప‌నిచేసిన ఛాన‌ల్ లో అభిప్రాయ భేదాలు రావ‌డం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్ల‌డంతో బిత్తిరి స‌త్తి స‌ద‌రు చాన‌ల్‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

ఆ త‌రువాత అంత‌కు మించిన సాల‌రీతో టీవి9లోకి అడుగు పెట్టాడు. బిత్తిరి స‌త్తి కోరిన సాల‌రీని అందిస్తూ టీవీ9 స్వాగ‌తం ప‌లికింది కూడా. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇస్మార్ట్ న్యూస్ పేరుతో ప్రోగ్రామ్ మొద‌లైంది. అంతా సాఫీగానే సాగుతున్న వేళ అనుకోని కుదుపు క‌ట్ చేస్తే బిత్తిరి స‌త్తి ఛాన‌ల్‌కు రాజీనామా. బిగ్‌బాస్ కోస‌మే రాజీనామా చేశాడ‌ని కొంత మంది, లేదు సాల‌రీ పెంచాలంటూ డిమాండ్ చేయ‌డంతో ఛాన‌ల్ నుంచి త‌ప్పించార‌ని కొంత మంది చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇదిలా వుంటే తాజా స‌మాచారం మాత్రం ఇందుకు భిన్నంగా వినిపిస్తోంది. టీవీ9 ఛాన‌ల్‌ని వ‌దిలిన బిత్తిరి స‌త్తి సాక్షి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్షం కాబోతున్నాడ‌ట‌. టీవి 9 అందించిన సాల‌రీతో పాటు కొంత ఫ్రీడ‌మ్‌ని అందిస్తుండ‌టంతో బిత్తిరి స‌త్తి వెంట‌నే సాక్షీ ఛాన‌ల్ వారి ఒప్పందానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే బిత్తిరి స‌త్తి స‌రికొత్త అవ‌తారంలో ఓ కొత్త కార్య‌క్ర‌మంలో ప్రారంభం కానుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All