
తీన్ మార్ ప్రోగ్రామ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బిత్తిరి సత్తి అనే ఒక్క కాన్సెప్ట్ తో షో స్థాయి పెంచేసిన రవి కుమార్ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా ఉన్న శివ జ్యోతి ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ జ్యోతి బిత్తిరి సత్తితో తనకున్న అనుబంధం గురించి వివరణ ఇచ్చారు.
సాధారణంగా ఆ షోలో తమది అక్కా తమ్ముళ్ల బంధం అయినప్పటికీ బయట మాత్రం తమది అన్నా చెల్లెళ్ళ బంధమని తెలిపారు. ఇక మీడియాలో ఎప్పుడైనా మేల్ డామినేషన్ ఉంటుందని చెబుతూ.. నా కంటే అతనికే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని వివరించింది. బిత్తిరి సత్తికి ఉన్న మార్కెట్ అలాంటిదని తనకు ఒక బ్రదర్ లా సలహాలు ఇస్తుంటారని అన్నారు.
తాను బిగ్ బాస్ షోకి వెళ్లేముందు అస్సలు వెళ్లకూడదని చెప్పినప్పటికీ ఒంటరి మహిళగా తనను తాను నిరుపించుకునేందుకు వెళ్లినట్లు శివ జ్యోతి చెప్పారు. బిత్తిరి సత్తి కూడా తన నిజ జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని తనతో పంచుకుంటాడని, అతను ఎక్కడికెళ్లినా సంతోషంగా ఉండాలని సోదరిగా కోరుకుంటున్నట్లు తీన్ మార్ సావిత్రి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
- Advertisement -
- Advertisement -