Homeటాప్ స్టోరీస్విజయ్ విజిల్ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్

విజయ్ విజిల్ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్

Whistle first week collections
Whistle first week collections

విజయ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ విజిల్ భారీ అంచనాల మధ్య విడుదలై మంచి టాక్ తో తొలి వారాంతం సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం విజిల్ మంచి వసూళ్లు రాబట్టడంతో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందని అనుకున్నారు విశ్లేషకులు. అయితే తొలి వారాంతం పూర్తైన తర్వాత విజిల్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. తొలి వారాంతమే ఆరున్నర కోట్లు వసూలు చేసిన విజిల్ తొలి వారం పూర్తయ్యేసరికి మరో రెండు కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అయితే రెండో వారాంతానికి చిత్రమేమైనా పుంజుకుంటుందేమో చూడాలి. మొత్తానికి విజిల్ తొలి వారంలో 8.93 కోట్లు వసూలు చేసింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలంటే మరో 2 కోట్లు వసూలు చేయాలి.

విజిల్ చిత్రం తెలుగులో భారీ బిజినెస్ చేసింది. విజయ్ – అట్లీ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం కావడం మార్కెట్ ఈ చిత్రంపై భరోసా ఉంచింది. దానికి తోడు ప్రోమోలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. ఈ నేపథ్యంలో తెలుగులో 118 సినిమాను ప్రొడ్యూస్ చేసిన మహేష్ ఎస్ కోనేరు పదిన్నర కోట్లకు విజిల్ రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్ర హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ రేటు పలికింది. విజిల్ చిత్రానికి ఓపెనింగ్ టాక్ బాగుండడంతో కలెక్షన్స్ అదిరిపోయాయి. అయితే అదే ఊపు వర్కింగ్ డేస్ లో కొనసాగించలేకపోయింది విజిల్.

- Advertisement -

విజయ్ ఈ రెండు చిత్రంలో రెండు పాత్రల్లో, మూడు గెటప్స్ లో కనిపించాడు. దాదాపు ప్రతి ఫ్రేమ్ లో విజయ్ ఈ చిత్రంలో కనిపించడం విశేషం. పూర్తిగా విజయ్ వన్ మ్యాన్ షోగా దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మధ్య వయస్కుడు రాజప్ప పాత్రలోనూ, మైఖేల్, బిగిల్ గా విజయ్ ఇందులో నటించాడు. రాజప్ప ఒక గ్యాంగ్ స్టార్ కాగా, మైఖేల్ మహిళల ఫుట్ బాల్ టీమ్ కు కోచ్ గా వెళ్తాడు.

అక్కడినుండి పరిస్థితులు ఏ విధంగా మారాయన్నది విజిల్ కథ. ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. రహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా బిగిల్ చిత్రం వసూళ్ల పరంగా సంతృప్తికరంగా ఉంది. దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది బిగిల్. తమిళనాడులో అయితే ఈ చిత్రం పెద్ద హిట్ అని చెప్పవచ్చు.

విజిల్ రెండు తెలుగు రాష్ట్రాల వన్ వీక్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
ప్రాంతం            షేర్ (కోట్లలో)

నైజాం                   2.70
సీడెడ్                   2.38
నెల్లూరు                0.39
కృష్ణ                     0.56
గుంటూరు              0.92
వైజాగ్                   0.97
ఈస్ట్ గోదావరి          0.58
వెస్ట్ గోదావరి           0.43

రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం  8.93

ఈరోజు విడుదలైన రెండు చిత్రాలు కూడా పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోవడంతో అది విజిల్ కు ఏమైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All