Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5 స్టార్ట్ డేట్ ఇదిగో!

బిగ్ బాస్ 5 స్టార్ట్ డేట్ ఇదిగో!

బిగ్ బాస్ 5 స్టార్ట్ డేట్ ఇదిగో!
బిగ్ బాస్ 5 స్టార్ట్ డేట్ ఇదిగో!

రియాలిటీ షోస్ లో టాప్ అనదగ్గ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కు సర్వం సిద్ధమవుతోంది. తెలుగులో ఒక సీజన్ కు మించి మరో సీజన్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా నాలుగో సీజన్ టీఆర్పీ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ప్రస్తుతం కరోనా కొంచెం శాంతించడంతో బిగ్ బాస్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి.

ఇప్పటికే కంటెస్టెంట్స్ ను దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లోంచి మరికొంత మందిని ఫైనల్ చేస్తారట. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 5 కు సంబంధించి మరికొంత సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ 5 మొదలుకానుంది. ఇక హోస్ట్ విషయంలో బోలెడన్ని రూమర్స్ నడిచాయి.

- Advertisement -

నాగార్జున బిజీగా ఉన్న కారణంగా రానా దగ్గుబాటి ఈ సీజన్ ను హోస్ట్ చేస్తాడని అన్నారు. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. నాగార్జునే సీజన్ 5 ను కూడా హోస్ట్ చేస్తాడట. ఈ షో కు సంబంధించి మరింత ఆసక్తికర సమాచారం త్వరలోనే రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All