Homeన్యూస్బజ్: రీఎంట్రీ కోసం పోల్ నిర్వహించనున్న బిగ్ బాస్ టీమ్

బజ్: రీఎంట్రీ కోసం పోల్ నిర్వహించనున్న బిగ్ బాస్ టీమ్

bigg boss 5 plans to make wild card entry with poll
bigg boss 5 plans to make wild card entry with poll

బిగ్ బాస్ సీజన్ 5 ఏడో వారంలో ఉంది. ఆసక్తికర టాస్క్ లతో, కంటెస్టెంట్ ల ప్రదర్శనలతో విజయవంతంగా దూసుకుపోతోంది. రీసెంట్ గా సీక్రెట్ రూమ్ నుండి లోబో తిరిగి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో బిగ్ బాస్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కొత్త వ్యక్తిని తీసుకొచ్చే బదులు ఎవరైనా ఎలిమినేటడ్ కంటెస్టెంట్ ను తిరిగి హౌజ్ లోకి పంపొచ్చన్న ఫీలింగ్ బిగ్ బాస్ మ్యానేజ్మెంట్ కు కలిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ దానికి తగిన సన్నాహాలు చేస్తోంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ల నుండి ఒకరిని హౌజ్ లోకి పంపాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్లుగా పోల్ ను నిర్వహించాలని భావిస్తోంది.

- Advertisement -

ఇప్పటివరకూ హౌజ్ నుండి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమా దేవి, లహరి, నటరాజ్, హమీద, శ్వేతాలు ఎలిమినేట్ కాగా ప్రస్తుత వారం నామినేషన్స్ లో శ్రీరామ్ చంద్ర, జెస్సీ, సిరి, కాజల్, ప్రియా, లోబో, రవి, ఎన్నీ మాస్టర్ లు ఉన్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All