Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న లహరి

బిగ్ బాస్ 5: హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న లహరి

బిగ్ బాస్ 5: హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న లహరి
బిగ్ బాస్ 5: హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న లహరి

బిగ్ బాస్ సీజన్ 5 ఏడో సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హౌజ్ నుండి ఆరుగురు ఎలిమినేట్ కాగా అందులో ఐదుగురు అమ్మాయిలే ఉన్నారు. ఈ వారం కూడా బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ కు ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ప్రస్తుతం లోబో సీక్రెట్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగా ఈరోజు మళ్ళీ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో రీఎంట్రీ ఉంటుందని టాక్ మొదలైంది. బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ, రీఎంట్రీ వంటివి మాములే. ఇక ఈ సీజన్ లో లహరి ఆ విధంగా తిరిగి హౌజ్ లోకి ఎంటర్ అవుతుందని అంటున్నారు. లహరి మూడో వారంలో హౌజ్ నుండి ఎలిమినేట్ అయింది. డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసినా కూడా లహరి ఎలిమినేట్ కావడం కొంత మందిని సర్ప్రైజ్ చేసింది.

- Advertisement -

దీంతో ఆమెకు సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని బిగ్ బాస్ భావిస్తోంది. ఇదంతా లహరి ఎలిమినేషన్ మీద ఒక సర్వే లాంటిది తీసుకోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్లామర్ పరంగా కూడా వ్యూయర్స్ ను ఆకర్షించగల లహరి హౌజ్ లో ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఆమె హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే క్వారంటైన్ లోకి కూడా వెళ్లినట్లు సమాచారం. లహరి రీఎంట్రీ గురించి మరింత సమాచారం త్వరలో తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All