Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్ 4 అవినాష్‌‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!

బిగ్‌బాస్ 4 అవినాష్‌‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!

బిగ్‌బాస్ 4 అవినాష్‌‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!
బిగ్‌బాస్ 4 అవినాష్‌‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో పాపుల‌ర్ అయ్యాడు క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌. ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ సీజ‌న్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి ప్ర‌వేశించాడు. క‌రోన‌రా క‌రాల నృత్యం చేస్తున్నా నిర్వాహ‌కులు ధైర్యంగా సీజ‌న్ 4ని ప్రారంభించ‌డంతో హౌస్‌లోకి నూహ్యంగా ఎంట్రీ సాధించిన అవినాష్ ఐయామ్ ఏ క‌మెడియ‌న్‌.. ఎంట‌ర్‌టైన‌ర్ అంటూ త‌న‌దైన స్టైల్లో న‌వ్వించాడు.

టాప్ 5లోకి ఎంట్రీ ఇస్తాడ‌నుకున్న అవినాష్ అనుకోకుండా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే అత‌ను బ‌య‌టికి రాగానే అతనికి వ‌రుస ఆఫ‌ర్లు వ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ షోని వ‌దిలి బిగ్‌బాస్ సీజ‌న్ 4లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో స్టార్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి అత‌నికి స‌ర్‌ప్రైజింగ్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం `ఎఫ్ 3`ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. త‌మ‌న్నా. మెహ‌రీన్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఫుల్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ముక్కు అవినాష్‌కు స్పెష‌ల్ రోల్‌ని అనిల్ రావిపూడి ఇచ్చిన న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All