Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్విశ్వ‌క్‌సేన్‌తో పీవీపీ, దిల్ రాజుల చిత్రం ప్రారంభం

విశ్వ‌క్‌సేన్‌తో పీవీపీ, దిల్ రాజుల చిత్రం ప్రారంభం

విశ్వ‌క్‌సేన్‌తో పీవీపీ, దిల్ రాజుల చిత్రం ప్రారంభం
విశ్వ‌క్‌సేన్‌తో పీవీపీ, దిల్ రాజుల చిత్రం ప్రారంభం

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, పీవీపి సినిమాకు టాలీవుడ్‌లో ఏ స్థాయిలో గుర్తింపు వుందో అంద‌రికి తెలిసిందే. ఈ రెండు భారీ నిర్మాణ సంస్త‌లు క‌ల‌సి గ‌తంలో `మ‌హ‌ర్షి` చిత్రాన్ని సి. అశ్వ‌నీద‌త్‌తో క‌లిసి నిర్మించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ రెండు సంస్థ‌లు మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ కోసం మ‌రోసారి చేయి క‌లిపాయి.

- Advertisement -

త‌మిళ హిట్‌చిత్రం `ఓ మై క‌డ‌వులే`ని తెలుగులో విశ్వ‌క్‌సేన్‌తో రీమేక్ చేస్తున్న వి‌ష‌యం తెలిసిందే. ఈ మూవీ సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త‌మిళ మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అశ్వ‌త్ మారిముత్తు ఈ రీమేక్ ద్వారా తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో విశ్వ‌క్‌సేన్‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌పన్నివేశానికి దిల్ రాజు క్లాప్ నివ్వ‌గా ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ కెమెరా స్విఛాన్ చేశారు.

యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు స్క్రిప్ట్‌ని ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. ఫిబ్ర‌వ‌రి మూడ‌వ వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జాతీయ స్థాయిలో ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యిత‌గా పుర‌స్కారం అందుకున్న త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి మాట‌లు రాస్తున్నారు. హీరోయిన్, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంద‌ని తెలిసింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts