Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్ సీజ‌న్ 4 మొద‌ల‌య్యేది అప్పుడే?

బిగ్‌బాస్ సీజ‌న్ 4 మొద‌ల‌య్యేది అప్పుడే?

 

big boss telugu seson 4 to be start on september 6
big boss telugu seson 4 to be start on september 6

బిగ్‌బాస్ సీజ‌న్ 4.. ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. శ్రీ‌ముఖి, రాహుల్ ల ర‌చ్చ‌తో బిగ్‌బాస్ సీజ‌న్ 3 మ‌రింత పాపుల‌ర్ అయ్యింది. దీంతో సీజ‌న్ 4ని మ‌రింత క్రేజీగా నిర్వాహ‌కులు డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. క్రేజీ బ్యాచ్‌ని సీజ‌న్ 4కు క‌న్ఫ‌ర్మ్ చేసిన నిర్వాహ‌కులు హోస్ట్‌గా తిరిగి నాగార్జున‌నే ఎంచుకోవ‌డం, వ‌రుస‌గా ఆయ‌న‌తో రెండు ప్రోమోల‌ని స‌రికొత్త స్టైల్లో షూట్ చేయ‌డంతో ఈ సీజ‌న్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది.

- Advertisement -

16 మంది కంటెస్టెంట్‌ల‌తో ఈ షోని ప్రారంభించ‌బోతున్నారు. ఇప్ప‌టికే క్రేజీ స్టార్స్‌ని కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేసి వారిని ప్ర‌త్యేకంగా ఓ హోట‌ల్‌లో వుంచిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా ఈ షోలో పాల్గొన‌బోతున్న ఓ కంటెస్టెంట్‌కి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింద‌ని, దీంతో అత‌న్ని క్వారెంటైన్‌కి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.  ఈ నేప‌థ్యంలో సీజ‌న్ 4 స్టార్టింగ్ డేట్ మారే అవ‌కాశాలు వున్నాయిని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
తెలుస్తోంది.

ఆ అనుమానాల‌కు త‌గ్గ‌ట్టే సీజ‌న్ 4 ఈ నెల 30న కాకుండా వ‌చ్చే నెల 6న కానున్న‌ట్టు తాజాగా తెలిసింది. ఈ సీజ‌న్‌లో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన క్రేజీ న‌టీన‌టుల‌తో పాటు పాపుల‌ర్ యాంక‌ర్స్‌, యూట్యూబ్ చాన‌ల్ యాంక‌ర్స్ పాల్గొన‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన కంటెస్టెంట్‌ల లిస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్‌బాస్ మేక‌ర్స్ మాత్రం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌డం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All