Homeటాప్ స్టోరీస్మెహ‌బూబ్‌కు మెగాస్టార్ మ‌రో ఆఫ‌ర్‌?

మెహ‌బూబ్‌కు మెగాస్టార్ మ‌రో ఆఫ‌ర్‌?

మెహ‌బూబ్‌కు మెగాస్టార్ మ‌రో ఆఫ‌ర్‌?
మెహ‌బూబ్‌కు మెగాస్టార్ మ‌రో ఆఫ‌ర్‌?

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఇటీవ‌లే ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో డ్యాన్స‌ర్‌గా ఎంట్రీ ఇచ్చి ఆక‌ట్టుకున్న కంటెస్టెంట్ దిల్ సే మెహ‌బూబ్‌. చివ‌రి మూడు వారాల‌కు ముందే ఓటీంగ్ కార‌ణంగా హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన మెహ‌బూబ్.. మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో ప‌డిన విష‌యం తెలిసిందే. గ్రాండ్ పినాలే స్టేజ్‌పై మోహ‌బూబ్ ని చూసి ముచ్చ‌ట‌ప‌డిన మెగాస్టార్ చిరంజీవి  అన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే.

ఇదే వేదిక‌పై అత‌నికి 10 ల‌క్ష‌ల చెక్కుని కోట్లాది మంది ప్రేక్ష‌కులు చూస్తుండ‌గా అందించి త‌న గొప్ప మ‌న‌సుని చాటుకున్నారు. యుక్త వ‌య‌సులో త‌న‌ని తాను చూసుకున్న‌ట్టుగా వుంద‌ని స‌ర్‌ప్రైజ్ చేశారు.  అంతే కాకుండా మెహ‌బూబ్ డ్యాన్స్‌కు ముచ్చ‌ట‌ప‌డిన మెగాస్టార్ త‌న తాజా చిత్రం `ఆచార్య‌`లో ఒక చిన్న పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఇచ్చ‌న‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఇదే నిజ‌మైతే మెహ‌బూబ్ పంట‌పండిన‌ట్టే అంటున్నారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్‌పై సోహైల్ పై మెగాస్టార్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. త‌ను చేయ‌బోయే సినిమా ఫంక్ష‌న్‌కు తాను వ‌స్తాన‌ని, అవ‌కాశం వుంటే చిన్న అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి కూడా తాను సిద్ధ‌మేనంటూ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దివికి కూడా `వేదాలం` రీమేక్‌లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించే అవకాశం క‌ల్పించారు. తాజాగా మెహ‌బాబ్‌కు `ఆచార్య‌`లో న‌టించే అవ‌కాశం క‌ల్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All