Homeన్యూస్పవన్ ఒత్తిడి వల్లే భీమ్లాను దించుతున్నారా..?

పవన్ ఒత్తిడి వల్లే భీమ్లాను దించుతున్నారా..?

పవన్ ఒత్తిడి వల్లే భీమ్లాను దించుతున్నారా..?
పవన్ ఒత్తిడి వల్లే భీమ్లాను దించుతున్నారా..?

నిన్న మంగళవారం ఉదయం వరకు కూడా భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 కష్టమే..ఏప్రిల్ 01 , లేదా ఏప్రిల్ 08 న రిలీజ్ చేస్తారని అంత అనుకున్నారు. కానీ రాత్రి రాత్రికే రిలీజ్ ఫిబ్రవరి 25 నే అని మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసి మిగతా సినిమాలకు షాక్ ఇచ్చారు. బరిలో భీమ్లా నాయక్ లేకపోవడం తో ఆడవాళ్లు మీకు జోహార్లు, గని చిత్రాలు ఫిబ్రవరి 25 న వస్తున్నట్లు ప్రకటించారు.

అంతే కాదు ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు భీమ్లా రిలీజ్ డేట్ తో వారు ఏంచేయాలో అర్థంకాని పరిస్థితి లో ఉండిపోయారు. అయినా సరే ధైర్యం చేసి ఆడవాళ్లు మీకు జోహార్లు నిర్మాత సుధాకర్ తమ సినిమాను  చెప్పిన తేదీకే విడుదల చేయాలనీ భావిస్తున్నాడట.  కానీ భీమ్లా నాయక్ సినిమాకు సోలో విడుదల కావాలని నిర్మాత నాగవంశీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

మరోపక్క గని చిత్రాన్ని అల్లు అరవింద్ తనయుడు బాబీ నిర్మించారు. ఈ మూవీతో ఈయన నిర్మాతగా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో భీమ్లా రిలీజ్ తో బాబీ సైతం అయోమయంలో పడిపోయాడట. నాగ వంశీ , త్రివిక్రమ్ తో సంప్రదింపులు చేస్తున్నప్పటికీ వారు మాత్రం తగ్గిదేలే అన్నట్లు ఉన్నారట. ఈ రిలీజ్ వెనుక పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉన్నట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

ఇదే సరైన టైం అని..పవన్ భావిస్తున్నాడట. ఇది తప్పితే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే..అని ఇప్పటికే ఆలస్యం అయ్యిందని ఎలాగైనా ఫిబ్రవరి 25 న విడుదల చేయాలనీ పవన్ పట్టుబట్టినట్లు చెపుతున్నారు. అందుకే నాగ వంశీ కూడా రాత్రి రాత్రికే రిలీజ్ డేట్ ప్రకటించారని అంటున్నారు. మరి భీమ్లా కు పోటీగా ఆడవాళ్లు , గని వస్తాయో..లేక వాయిదా వెసుకుంటాయో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All