
పవన్ కళ్యాణ్ గత కొద్దీ రోజులుగా అయోమయంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25 న వస్తుందా..ఏప్రిల్ 01 న వస్తుందా..లేదా ఏప్రిల్ 08 న వస్తుందా ఇలా ఏ డేట్ కు వస్తుందో అంటూ మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగ వంశీ రిలీజ్ డేట్ ఇదే అంటూ అధికారిక ప్రకటన చేసి అభిమానుల్లో పవర్ నింపారు.
ఫిబ్రవరి 25న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నామని తెలుపుతూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఆశ్చర్య పరిచారు. “25 – 02 – 2022!! పవర్ స్టార్మ్ తెరపైకి రావడానికి తేదీ సెట్ చేసాం“ అంటూ ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ డాషింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక విడుదలకు కేవలం 10 రోజులే ఉండడం తో ఈ తక్కువ టైములో చిత్ర ప్రమోషన్ ను ఏ విధంగా చేస్తారో చూడాలి. మరోపక్క ఈ నెల 18 నుండి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
ఇక భీమ్లా నాయక్ విషయానికి వస్తే..పవన్ కళ్యాణ్ , రానా నటిస్తుండగా..వీరికి జోడిగా నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. థమన్ మ్యూజిక్.
25’th ?#PowerStrom ? let’s have a #LaLaBheemla TIME AT THEATRES ▶️❤️?#BheemlaNayakOn25thFeb ?❤️?? pic.twitter.com/PpN61NEcQd
— thaman S (@MusicThaman) February 15, 2022