Homeన్యూస్హైదరాబాద్ లో హాట్ కేకుల్లా అమ్ముడైన భీమ్లా నాయక్ టికెట్స్

హైదరాబాద్ లో హాట్ కేకుల్లా అమ్ముడైన భీమ్లా నాయక్ టికెట్స్

హైదరాబాద్ లో హాట్ కేకుల్లా అమ్ముడైన భీమ్లా నాయక్ టికెట్స్
హైదరాబాద్ లో హాట్ కేకుల్లా అమ్ముడైన భీమ్లా నాయక్ టికెట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పలు చోట్ల టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో అన్ని చోట్ల ఓపెన్ కాకపోవడం అందర్నీ షాక్ లో పడేస్తుంది.సాధారణంగా పెద్ద హీరోల చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల తేదీకి కనీసం వారం రోజుల ముందు ప్రారంభమవుతాయి. యూఎస్ఏలో వారం ముందే ‘భీమ్లా నాయక్’ సినిమా ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చాలా వరకు మల్టీఫ్లేక్స్ లలో ‘భీమ్లా నాయక్’ అడ్వాన్స్ బుకింగ్స్ తెరుచుకున్నాయి. ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మిగతా స్క్రీన్స్ లోనూ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా బుక్ మైషోలో ఏపీ తో పాటుగా మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బుకింగ్స్ ఇంకా తెరవబడలేదు.

- Advertisement -

వైజాగ్ వంటి పలు ప్రధాన నగరాల్లో ఇంకా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ తెరుచుకోకపోవడం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరోపక్క సోమవారం రిలీజ్ అయినా ట్రైలర్ తో అభిమానుల్లో సినిమా చూడాలనే ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలసిందే అని పట్టుపడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All