Homeగాసిప్స్ఆచార్య రిక్వెస్ట్ ను కాదన్న బీమ్లా నాయక్?

ఆచార్య రిక్వెస్ట్ ను కాదన్న బీమ్లా నాయక్?

ఆచార్య రిక్వెస్ట్ ను కాదన్న బీమ్లా నాయక్?
ఆచార్య రిక్వెస్ట్ ను కాదన్న బీమ్లా నాయక్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దీంతో చిరంజీవి తన నెక్స్ట్ సినిమా గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీగా మారాడు. మరోవైపు కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో ఉండటంతో ఆ పనుల్లో బిజీగా మారాడు. ఆచార్య చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేద్దామన్నది టీమ్ ప్లాన్. మళ్ళీ నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలుపెట్టాలని భావించారు.

కాకపోతే సంక్రాంతికి ఇప్పటికే మూడు బడా సినిమాలు లాక్ అయ్యాయి. రాధే శ్యామ్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వస్తున్నాయి. అందుకోసమే ఆచార్య టీమ్ భీమ్లా నాయక్ టీమ్ ను సంక్రాంతి స్లాట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసిందిట. కానీ భీమ్లా నాయక్ సంక్రాంతికి వస్తుందని బలంగా జనాల్లోకి వెళ్లిపోయిందని ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చుకోలేమని చెప్పారట.

- Advertisement -

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతోన్న భీమ్లా నాయక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All