Homeగాసిప్స్కొత్త డేట్ చూసుకుంటోన్న భీమ్లా నాయక్!!

కొత్త డేట్ చూసుకుంటోన్న భీమ్లా నాయక్!!

కొత్త డేట్ చూసుకుంటోన్న భీమ్లా నాయక్!!
కొత్త డేట్ చూసుకుంటోన్న భీమ్లా నాయక్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా కనిపించనుండగా, రానాది డేనియల్ శేఖర్ పాత్ర. వీరిద్దరి మధ్య ఇగో క్లాష్ లు ఏ పరిస్థితులకు కారణమయ్యాయి అన్నది ప్రధాన పాయింట్.

భీమ్లా నాయక్ ను సంక్రాంతికి అనౌన్స్ చేసారు నిర్మాతలు. జనవరి 12న తమ చిత్రం విడుదలవుతుంది అని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే రెండు సాంగ్స్ ను కూడా విడుదల చేసారు. అవి చార్ట్ బస్టర్స్ గా మారిన విషయం తెల్సిందే. అయితే సంక్రాంతి విడుదల నుండి ఇప్పుడు భీమ్లా నాయక్ తప్పుకుంటోందని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల అవుతుండడం, రాధే శ్యామ్ రిలీజ్ జనవరి 14కి ఫిక్స్ అవ్వడంతో భీమ్లా నాయక్ విషయంలో రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు.

- Advertisement -

ఇప్పటికే సర్కారు వారి పాటను సంక్రాంతి రేసు నుండి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు భీమ్లా నాయక్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. తాజా సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ కోసం జనవరి 26 కానీ మార్చ్ 1 కానీ తేదీలను పరిశీలిస్తున్నారట. ఏదేమైనా డిసెంబర్ నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All