Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ ను దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్

భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ ను దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్

భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ ను దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్
భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ ను దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తోన్న చిత్రానికి భీమ్లా నాయక్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన విషయం తెల్సిందే. భీమ్లా నాయక్ క్యారెక్టర్ టీజర్ కు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

పృథ్వీరాజ్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనుండగా, బిజూ మీనన్ రోల్ ను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ చేజిక్కించుకుంది. ఏకంగా ఈ చిత్ర ఆడియో రైట్స్ కోసం రూ. 5.04 కోట్లను చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది ఒక రికార్డ్ ధరగా చెప్పవచ్చు.

- Advertisement -

సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All