
టాప్ నటి సమంత రీసెంట్ గా శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది సమంత. నయనతార ప్రొడక్షన్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం పూర్తి చేసిన తర్వాత సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
11 సంవత్సరాల తర్వాత సమంత బ్రేక్ తీసుకుంటోంది. ఇక ఈ ఏడాది కొత్త సినిమాలు సంతకం చేసే అవకాశం లేనట్లే. ఇదే ఇంటర్వ్యూలో తనకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కానీ దాన్ని కాదనుకున్నా అని తెలిపింది. ఇక ఓటిటి ఆఫర్ల సంగతైతే చెప్పాల్సిన అవసరం లేదు.
మొత్తానికి ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలన్న కారణంతో సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో రాజీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే అంతే స్థాయిలో కాంట్రవర్సీ అయిన విషయం కూడా తెల్సిందే.