Homeటాప్ స్టోరీస్అన్ సీజన్ అయినా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది

అన్ సీజన్ అయినా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది

అన్ సీజన్ అయినా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది
అన్ సీజన్ అయినా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది

సాధారణంగా ఫిబ్రవరి నుండి మార్చ్ వరకూ అన్ సీజన్ గా పరిగణిస్తారు సినిమా వాళ్ళు. ఇది కేవలం తెలుగు సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు. బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ భాష తీసుకున్నా కానీ ఈ రెండు నెలల్లో సినిమాలు ఢీలా పడుతుంటాయి. సినిమాలు విడుదలైనా కలెక్షన్లు మాత్రం తక్కువే ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలను ఈ రెండు నెలల్లో విడుదల చేయడానికి ఎవరూ పెద్ద ఆసక్తి చూపించరు. పోటీ ఉండకూడదన్న వాళ్ళు, చిన్న సినిమాలు ఈ కాలంలో సినిమాలను రిలీజ్ చేసుకుని తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటాయి.

తెలుగులో ఈ రెండు నెలల్లో సినిమాల పరిస్థితి ఏమంత బాగోలేదు. నితిన్ హీరోగా వచ్చిన భీష్మ బయ్యర్లకు లాభాలు అందిస్తే.. హిట్ చిత్రం మాత్రం యావరేజ్ గా నిలిచింది. మిగిలిన సినిమాలు అన్నీ వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ఇక గత వారాంతం విడుదలైన చిత్రాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

- Advertisement -

టాలీవుడ్ సంగతి ఇలా ఉంటే బాలీవుడ్ లో ఒక సినిమా మాత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ దూసుకుపోతోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన భాగీ 3 వసూళ్ల సునామీ సృష్టించడం విశేషం. భాగీ తమిళ చిత్రానికి రీమేక్. అదే సినిమా తెలుగులో నాగ చైతన్య, సునీల్ హీరోలుగా తఢాకా పేరుతో తెరకెక్కింది. అదే కథను టైగర్ ష్రాఫ్ మార్పులు చేర్పులు చేసి హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా మార్చుకుని విడుదల చేసాడు. భారీ యుద్ధాలు, తన నుండి కోరుకునే ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్స్ లు కలిపి ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఓ పక్క పరీక్షలు, మరోపక్క కరోనా భయం ఉన్నా కానీ భాగీ 3 కలెక్షన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. ఈ చిత్రం తొలి వీకెండ్ లో దాదాపు 53 కోట్ల కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిరోజు 17.50 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం శనివారం 16, ఆదివారం 20 కోట్లతో దూసుకుపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 100 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All