Homeటాప్ స్టోరీస్భీష్మ దర్శకుడు కంగారులో లేడు!

భీష్మ దర్శకుడు కంగారులో లేడు!

భీష్మ దర్శకుడు కంగారులో లేడు!
భీష్మ దర్శకుడు కంగారులో లేడు!

ఈరోజుల్లో ఎవరైనా దర్శకుడు ఒక హిట్ కొట్టాడంటే వెంటనే ఆ దర్శకుడి చుట్టూ నిర్మాతలు చేరిపోవడం, ముందుగా అడ్వాన్స్ ఇచ్చి తమ బ్యానర్ కు ఖాయం చేసుకోవడం చూస్తున్నాం. అలాగే హీరో కూడా ఆ దర్శకుడి దగ్గర తనకు సూట్ అయ్యే కథ ఏమైనా ఉందా అన్న ఆరాలు మొదలవుతాయి. ఈ తొందర్లో ఆ దర్శకుడు ఏదొక సినిమాకు కమిటైపోవడం, స్క్రిప్ట్ మీద పూర్తిగా పనిచేయకుండా సినిమాను స్టార్ట్ చేసేస్తుంటారు. దాంతో తర్వాతి సినిమా బాల్చీ తన్నేస్తుంది.

అయితే దర్శకుడు వెంకీ కుడుముల మాత్రం ఇటువంటి వాటికి లొంగేది లేదంటున్నాడు. తొలి సినిమా ఛలోతో మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ దర్శకుడు. అయితే రెండో సినిమా విడుదల చేయడానికి మాత్రం రెండేళ్లు పట్టింది. అంతా పక్కా అనుకున్నాకే షూటింగ్ కు వెళ్ళాడు. రెండో సినిమా భీష్మ సక్సెస్ గురించి చెప్పేదేముంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అన్ సీజన్ లో విడుదలైనా కూడా కలెక్షన్స్ కు ఢోకా లేకుండా పోయింది. బయ్యర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు.

- Advertisement -

రెండో సినిమా కూడా సక్సెస్ సాధించడంతో వెంకీ కుడుములకు ఉన్న డిమాండ్ మళ్ళీ పెరిగింది. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఇతడితో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే హీరోలు కూడా డేట్లు సర్దుబాటు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే వెంకీ భీష్మ సక్సెస్ వేడి మొత్తం తగ్గాకే తన తర్వాతి చిత్రం గురించి ఆలోచిస్తా అంటున్నాడు. అంటే నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టడానికే మరో రెండు నెలల సమయం పడుతుందిట.

ఈ ఏడాది చివరికి కానీ తన నెక్స్ట్ సినిమా ఎంటనేదానిపై క్లారిటీ రాదంటున్నాడు. ఇలా గ్యాప్ తీసుకుని సక్సెస్ కొట్టడం వరకూ ఓకే కానీ మరీ సినిమా సినిమాకూ రెండేళ్ల గ్యాప్ అంటే కష్టమేమో చూసుకో కుడుముల.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All