Homeగాసిప్స్భీష్మ పది కోట్ల దాకా నష్టపోయిందా?

భీష్మ పది కోట్ల దాకా నష్టపోయిందా?

భీష్మ పది కోట్ల దాకా నష్టపోయిందా?
భీష్మ పది కోట్ల దాకా నష్టపోయిందా?

ఏదైనా సినిమాకు సక్సెస్ఫుల్ కంటెంట్ ఉండడం ఎంత ముఖ్యమో, సరైన సమయానికి రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక్కోసారి పెద్దగా కంటెంట్ లేకపోయినా కానీ రిలీజ్ టైమింగ్ కలిసొచ్చి సినిమాలు ఆడేస్తుంటాయి. ఒక్కోసారి ఎంత కంటెంట్ బాగున్నా కానీ సరైన సమయానికి రిలీజ్ చేయకపోవడంతో రిలీజ్ విషయంలో దెబ్బైపోతుంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి రెండు సినిమాలు మనకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

నిజానికి ప్రతిరోజూ పండగే వసూళ్లకు దానికి వచ్చిన కలెక్షన్స్ కు పెద్దగా పొంతన ఉండదు. అది హిట్ అవ్వాల్సిన కంటెంట్. అందులో ఎటువంటి ఢోకా లేదు. అయితే ఈ చిత్రం మహా అయితే 25 కోట్ల వరకూ తెచ్చుకోగలదు అనుకున్నారు మొదటి రోజు వచ్చిన రేటింగ్స్ చూసి. అయితే సంక్రాంతి సీజన్ కు విడుదలవ్వడం, పెద్దగా పోటీ కూడా లేకపోవడం ఈ చిత్రానికి భలే కలిసొచ్చాయి. కట్ చేస్తే ఈ చిత్రం దాదాపు 35 కోట్ల షేర్ ను రాబట్టింది. నిర్మాతలకు డబల్ ప్రాఫిట్స్ దక్కాయి. అంతకు ముందు వారం వచ్చిన వెంకీ మామ పరిస్థితి కూడా అంతే. దానికి కంటెంట్ ఇంకా వీక్ గా ఉంది. కానీ రిలీజ్ టైమింగ్ కలిసొచ్చి సినిమా దగ్గరదగ్గర 40 కోట్ల మేర వసూలు చేసి హిట్ అనిపించుకోగలిగింది.

- Advertisement -

కట్ చేస్తే ఇప్పుడు భీష్మ విషయానికి వద్దాం. ఈ సినిమాకు తొలిరోజు రివ్యూలు అదిరిపోయాయి. మౌత్ టాక్ కూడా భీభత్సంగా వచ్చింది. తొలిరోజు, తొలి వీకెండ్ వరకూ కలెక్షన్స్ కు ఢోకా లేకుండా పోయింది. అయితే సరైన సమయంలో రిలీజ్ చేయని ఈ సినిమాకు ఆ తర్వాత నుండి కష్టాలు మొదలయ్యాయి. సాధారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుండి మార్చ్ రెండవ వారం వరకూ సినిమాలకు అన్ సీజన్. పరీక్షల సీజన్ కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూడటానికి ఇష్టపడరు. భీష్మ ఇప్పటివరకూ దాదాపు 26 కోట్ల వరకూ వసూలు చేసింది. అదే ఏ క్రిస్మస్ సీజన్ కో ఈ చిత్రం వచ్చి ఉంటే, లేదా మరో నెల ఆగి మార్చ్ నెలాఖరుకు సినిమాను దింపి ఉంటే ఈజీగా మరో 10 కోట్ల దాకా వచ్చి ఉండేది. బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా కాస్తా హిట్ తో సరిపెట్టుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All