
విభిన్నమైన స్టైల్స్‌కి, మేనరిజమ్స్ కెరాఫ్ అడ్రస్ తలైవా సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన స్టైల్‌ని కాపీ కొట్టాలని, ఆయన నడకని కాపీ కొట్టాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. రజనీ స్టైల్స్‌లో గాగూల్స్ మెరుపు వేగంతో స్టైల్ గా తప్పి పెట్టుకోవడం మెయిన్ హైలైట్. దాన్నే కాపీ కొట్టాలని చూస్తే ఎలా.. అంటున్నారు రజనీ ఫ్యాన్స్. ఇంతకీ రజనీ గాగూల్స్ స్టైల్‌ని కాపీ కొట్టాలనుకుంది మరెవరో కాదు సాహసాల వీరుగు బేర్ గ్రిల్స్.
డిస్కవరీ ఛానెల్‌లో వచ్చే `మ్యాన్ వర్సెస్ వైల్డ్` డాక్యుమెంటరీ గురించి తెలిసిన వాళ్లకి బేర్ గ్రిల్స్ సాహసాలు సుపరిచితమే. ఇటీవల ప్రధాని మోదీతో ఈ సాహస యాత్రని చేసి ఇండియాలో వార్తల్లో నిలిచిన బేర్ గ్రిల్స్ తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఈ డాక్యమెంటరీని రూపొందించాడు. జనవరిలో కర్ణాటక అడవుల్లో రజనీ పాల్గొనగా చిత్రీకరించిన `మ్యాన్ వర్సెస్ వైల్డ్` డాక్యుమెంటరీని ఈ నెల 23న డిస్కవరీ ఛానల్‌లో టెలికాస్ట్ చేశారు.
ఈ ఎపిసోడ్‌లో బేర్ గ్రిల్స్ సూపర్‌స్టార్ రజనీ స్టైల్ ని అనుకరించే ప్రయత్నం చేశాడు. రజనీ తరహాలో గాగూల్స్ తిప్పేస్తూ పెట్టుకునే ప్రయత్నం చేసి రెండు మూడు సార్లు విణలమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియో చూసిన రజనీ ఫ్యాన్స్ మాత్రం తలైవా స్టైల్‌ని అంత ఈజీగా కాపీ కొట్టలేవు గురూ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.
?????#Thalaivar Teaching his Glass Style to @BearGrylls#ThalaivaOnDiscovery@Actor_Vivek @KavithalayaaOff @actorsathish @soundaryaarajni @karthiksubbaraj @vp_offl @anirudhofficial pic.twitter.com/FzDdXpTqC0
— Rajinikanth Fans ? (@Rajni_FC) March 23, 2020
Credit: Twitter