Homeటాప్ స్టోరీస్ఆత్మహత్య చేసుకుంటానంటున్న బండ్ల గణేష్

ఆత్మహత్య చేసుకుంటానంటున్న బండ్ల గణేష్

Bandla ganesh sensational comments on kcrకాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసాడు నిర్మాత , నటుడు బండ్ల గణేష్ . ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజేంద్ర నగర్ , షాద్ నగర్ ల నుండి అసెంబ్లీ కి పోటీ చేయాలనీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసాడు బండ్ల , అయితే రాజేంద్ర నగర్ సీటు పొత్తులో భాగంగా పోగా షాద్ నగర్ సీటు బండ్ల గణేష్ కు కేటాయించలేదు . దాంతో కినుక వహించాడు అది గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు బండ్ల గణేష్ ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి గా నియమించారు . అసెంబ్లీ టికెట్ దక్కకపోయినా పార్టీ పదవి లభించిందని సంతోష పడుతున్నాడు బండ్ల .

ఆ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన బండ్ల గణేష్ పెద్ద బాంబ్ పేల్చాడు . కేసీఆర్ మాత్రమే కాదు కేటీఆర్ కూడా ఓడిపోవడం ఖాయమని ఒక్క హరీష్ రావు మాత్రమే గెలుస్తాడని , టీఆర్ఎస్ నుండి మరో పదిమంది ముఖ్యమైన నాయకులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని …….. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నా గొంతు కోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసాడు . ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ సభ్యడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ వచ్చినట్లు కనబడుతోంది .

- Advertisement -

English Title: Bandla ganesh sensational comments on kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All