Homeటాప్ స్టోరీస్క్రేజీ సినిమా ఫ్లాప్ అని తేల్చాడు!

క్రేజీ సినిమా ఫ్లాప్ అని తేల్చాడు!

క్రేజీ సినిమా ఫ్లాప్ అని తేల్చాడు!
క్రేజీ సినిమా ఫ్లాప్ అని తేల్చాడు!

బండ్ల గ‌ణేష్ స్పందించే తీరు వేరు. త‌న‌కు ఏద‌నిపిస్తే అదే మాట్లాడే బండ్ల గణేష్ తాజాగా త‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో నిర్మించిన `తీన్‌మార్‌` చిత్రంపై సంచ‌ల‌న ట్వీట్‌లు చేశారు. ప‌వ‌ర్‌స్టార్‌పై  ప్ర‌శంస‌ల వ‌ర్ం కురిపించారు. ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన చిత్రం `తీన్‌మార్‌`. జ‌యంత్ సి. ప‌రాన్జీ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14తో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ త‌న‌దైన శైలిలో స్పందించారు.

`తీన్‌మార్‌` త‌న జీవితంలో మ‌ర్చిపోలేని చిత్ర‌మని, విజ‌యం సాధించ‌క‌పోయినా నిర్మాత‌గా త‌న‌కు మర్చిపోలేని అద్భుత‌మైన అనుభూతిని మిగిల్చింద‌ని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని కాశీ, మైసూర్‌, అమెరికా, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్‌లో షూట్ చేశాం. ఈ చిత్రంలో హృద‌యానికి హ‌త్తుకునే అద్భుత‌మైన డైలాగ్స్ ఎన్నో వున్నాయని, ఉదాహ‌ర‌ణ‌కు ..అందంగా లేద‌ని అమ్మ‌ని, కోపంగా వున్నాడ‌ని నాన్న‌ని వ‌ద‌లేవు క‌దా… వంటి డైలాగ్ లెన్నో వున్నాయన్నారు.

- Advertisement -

అర్జున్ పాల్వాయ్‌గా, మైఖేల్ వేలాయుధంగా మా బాస్ ఈ చిత్రంలో అద్భుతంగా న‌టించార‌ని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ న‌టుడిగా రీఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All