Homeగాసిప్స్మ‌హేష్‌కి భ‌క్తుడిగా మారిపోయాడా?

మ‌హేష్‌కి భ‌క్తుడిగా మారిపోయాడా?

మ‌హేష్‌కి భ‌క్తుడిగా మారిపోయాడా?
మ‌హేష్‌కి భ‌క్తుడిగా మారిపోయాడా?

నిర్మాత న‌టుడు బండ్ల గ‌ణేష్‌కు ఎప్పుడు ఎవ‌రిపై ప్రేమ పుడుతుందో చెప్ప‌డం క‌ష్టం. గ‌తంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కు వీర విధేయుడిగా, వీర భ‌క్తుడిగా వ్య‌వ‌హ‌రించిన బండ్ల గ‌ణేష్ ప‌వ‌ర్ స్టార్‌తో తీన్‌మార్‌, గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించారు. ఆ త‌రువాత కూడా సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు.

అయినా స‌రే ప‌వన్‌కు వీర భ‌క్తుడిగా సోష‌ల్ మీడియాలో ట్వీట్‌లు చేశారు. కానీ పొలిటిక‌ల్ ఎంట్రీ త‌రువాత సీన్ మారింది. ప‌వ‌ర్ స్టార్‌పై ప్ర‌శంస‌లు త‌గ్గించారు. గ‌తెన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ త‌రుపున గండ్ల గ‌ణేష్ చేసిన హ‌డావిడీ అంతా ఇంతా కాదు. తానే ఎమ్మెల్యే కాబోతున్న‌ట్టు ప‌లు టీవీ లైవ్‌ల‌లో ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న‌ట్టు ట్రైల్స్ కూడా వేసి న‌వ్వించారు కూడా.

- Advertisement -

ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు. ఈ సినిమాలో బ్లేడ్ బ్యాచ్‌కి లీడ‌ర్‌గా న‌వ్వులు పూయించిన బండ్ల గ‌ణేష్ తాజాగా చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. హీరో మ‌హేష్‌ని హాలీవుడ్ హీరో అంటూ కీర్తిస్తూ ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్స్ అంతా బండ్ల గ‌ణేష్ పార్టీ మార్చి  హీరో మ‌హేష్‌కు భ‌క్తుడిగా మారిపోయారంటూ కామెంట్‌లు చేస్తున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All