Homeటాప్ స్టోరీస్`న‌ర్త‌న‌శాల` కుద‌ర‌లేదు మ‌రి ఇదైనా కుదిరేనా?

`న‌ర్త‌న‌శాల` కుద‌ర‌లేదు మ‌రి ఇదైనా కుదిరేనా?

Balakrishna taking megaphone
Balakrishna taking megaphone

క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు 1963లో రూపొందించిన చిత్రం `న‌ర్త‌న‌శాల‌` స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు అర్జునుడిగా , బృహ‌న్న‌ల‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ద్రౌప‌దిగా సావిత్రి న‌టించిన ఈ చిత్రం తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో మ‌ర‌పురాని చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ చిత్రాన్ని 2003లో మార్చి 1న రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద‌యం 7:30 గంట‌ల‌కు బాల‌య్య స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లుపెట్టారు. ల‌క్ష్మీప‌తిరాజు ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రంతో బాల‌య్య ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేయాల‌నుకున్నారు. ద్రౌప‌ది పాత్ర‌లో సౌంద‌ర్య‌, భీముడిగా శ్రీ‌హ‌రిల‌ని ఎంచుకున్నారు.

భారీ స్థాయిలో ఓపెనింగ్ జ‌రిగింది. ఆ త‌రువాత జ‌రిగిన హెలీకాప్టర్ ప్ర‌మాదంలో సౌంద‌ర్య చ‌నిపోవ‌డం, కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో ఈ చిత్రాన్ని బాల‌య్య అర్థాంత‌రంగా ఆపేశారు. ఆ త‌రువాత మ‌ళ్లీ రివైవ్ చేయాల‌నుకున్నా చేయ‌లేదు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు బాల‌య్య మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. `ఆదిత్య 369` చిత్రానికి సీక్వెల్‌గా `ఆదిత్య 999` చిత్రాన్ని చేయాల‌నుకున్నారు. సింగీతం శ్రీ‌నివాస‌రావు క‌థ‌ని కూడా సిద్ధం చేశారు. అయితే కొన్ని మార్పులు అవ‌స‌కం వుండ‌టం, అదే స‌మ‌యంలో `గౌత‌మీపుత్ర‌` శాత‌క‌ర్ణి` తెర‌పైకి రావ‌డంతో `ఆదిత్య 999` ప‌క్క‌న ప‌డింది. ఇప్పుడు అదే చిత్రాన్ని బాల‌య్య టేక‌ప్ చేయ‌బోతున్నార‌ట‌.

- Advertisement -

అయితే ఈ చిత్రానికి సింగీతం శ్రీ‌నివాస‌రావు కాకుండా బాల‌య్యే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని, ఇది వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని, దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని హీరో బాల‌కృష్ణ వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది. ప్రస్తుతం మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా త‌రువాతే `ఆదిత్య 999` తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All