Homeగాసిప్స్అయ్యో బాల‌య్య ఏంటీ ప‌రిస్థితి!

అయ్యో బాల‌య్య ఏంటీ ప‌రిస్థితి!

అయ్యో బాల‌య్య ఏంటీ ప‌రిస్థితి!
అయ్యో బాల‌య్య ఏంటీ ప‌రిస్థితి!

రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ చిత్రాల‌కు కెరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, చెన్న‌కేశ‌వ‌రెడ్డి వంటి ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రాలు తెలుగు సినీ చ‌రిత్ర‌లో వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపించి బాల‌య్య‌ను బాక్సాఫీస్ బొనాంజాగా మార్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇది నిన్న‌టి మాట. ప్రేక్ష‌కుడి టేస్ట్ మారింది. ఊర మాస్ సినిమాలు ఇప్పుడెవ‌రూ చూడ‌టం లేదు. కంటెంట్ బావుందంటే చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా చూడ‌టం లేదు. అదే స‌మ‌యంలో క‌థ లేదని తేలితే ఎంత పెద్ద స్టార్ హీరో చిత్రాన్నైనా ప‌క్క‌న పెట్టేస్తున్నారు.

బాల‌కృష్ణ సినిమా ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది. బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం `రూల‌ర్‌`. వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ కె.ఎస్‌. ర‌వికుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ హంగులు ఆర్భాటాల‌తో మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో బాల‌కృష్ణ‌ని చూపించిన తీరు, ఆయ‌న ప‌లికిన డైలాగ్‌లు ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి. అయితే ట్రైల‌ర్ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వ‌ద్ద బ‌జ్ ఏ మాత్రం క్రియేట్ కాలేదు.

- Advertisement -

ఇందులో వేదిక‌, సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్‌లుగా న‌టించారు. ఈ ఇద్ద‌రి గ్లామ‌ర్‌ని అడ్డుపెట్టుకుని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా అదీ వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఇన్ని మైన‌స్‌లున్నఈ చిత్రాన్ని కొన‌డానికి ఏ డిస్ట్రిబ్యూట‌ర్ ఇంట్రెస్ట్ చూపించ‌డం లేద‌ట‌. బాల‌కృష్ణ చిత్రాలు గ‌త కొంత కాలంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయాయి. అదే `రూల‌ర్‌` చిత్రానికి షాపంగా మారింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుత‌ ప‌రిస్థితుల్లో భారీ మొత్తాలు చెల్లించి బాల‌య్య చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయ‌డం ప్ర‌మాద‌మ‌ని బ‌య్య‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇంతలో ఎంత మార్పు… బాల‌య్య సినిమా కోసం క్యూ క‌ట్టిన బ‌య్య‌ర్స్ ఇప్పుడు ముఖం చాటేస్తుండ‌టంతో అయ్యో బాల‌య్య ఏంటీ ప‌రిస్థితి అని సినీ ప్రియులు నిట్టూరుస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All