Homeటాప్ స్టోరీస్బాల‌య్య‌ని `రూల‌ర్` గ‌ట్టెక్కిస్తుందా?

బాల‌య్య‌ని `రూల‌ర్` గ‌ట్టెక్కిస్తుందా?

balakrishna ruler to became a decent hit
balakrishna ruler to became a decent hit

టాలీవుడ్‌లో రాకెట్ స్పీడుతో సినిమాలు చేస్తుంటారు పూరి జ‌గ‌న్నాథ్‌. ఆయ‌న‌కు మించిన రెట్టింపు స్పీడుతో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు హీరో బాల‌కృష్ణ‌. త‌న స‌హ‌చ‌ర హీరోలంతా ఏడాదికి ఒక‌టి లేదా రెండు చిత్రాల‌తోనే స‌రిపెట్టుకుంటుంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంటే మ‌రో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళుతున్నారాయ‌న‌. బాల‌య్య న‌టిస్తున్న తాజా చిత్రం `రూల‌ర్‌`. ర‌జ‌నీతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని అందించిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.ఎస్‌. ర‌వికుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

త‌న తండ్రి స్వ‌ర్గీయ తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా నిర్మించిన `ఎన్‌టిఆర్‌` బ‌యోపిక్ రెండు భాగాలు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ వైఫ‌ల్యాన్ని చ‌విచూశాయి. ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకుని `రూల‌ర్‌`తో మ‌ళ్లీ స‌క్సెస్‌ల బాట‌ప‌ట్టాల‌ని బాల‌య్య భావిస్తున్నారు. వేదిక‌, సోనాల్ చౌహాన్ గ్లామ‌ర్ షోతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 21 కోట్లు చేసింద‌ట‌. దానికి మించి క‌లెక్ష‌న్‌లు రాబ‌డితే సినిమా నిర్మాత సి. క‌ల్యాణ్ లాభాల్ని అందుకుంటారు. లేని ప‌క్షంలో పెట్టింది వ‌చ్చింద‌ని స‌రిపెట్టుకోవాల్సిందే.

- Advertisement -

కె.ఎస్‌. ర‌వికుమార్ టేకింగ్‌, వేదిక‌, సోనాల్ చౌహాన్‌ల గ్లామ‌ర్ షో, బాల‌య్య మాస్ యాక్ష‌న్ ఈ చిత్రానికి కొంత మేర‌కు ప్ల‌స్ అయి సినిమా `జ‌య‌సింహ‌` త‌ర‌హాలో సైలెంట్ హిట్‌గా నిలిచే అవ‌కాశం వుంద‌ని కొంత మంది చెబుతుంటే ట్రేడ్ వ‌ర్గాలు మాత్రం మ‌రోలా అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టి రేసులోకి రావాల‌ని భావిస్తున్న బాలయ్య కోరిక‌ని `రూల‌ర్` నెర‌వేరుస్తుందా?.. ఈ గండం నుంచి బాల‌య్య‌ను సేఫ్‌గా గ‌ట్టెక్కిస్తాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All