Homeటాప్ స్టోరీస్బ‌ర్త్‌డే రోజున టీజ‌ర్‌తో ట్రీటిస్తార‌ట‌!

బ‌ర్త్‌డే రోజున టీజ‌ర్‌తో ట్రీటిస్తార‌ట‌!

బ‌ర్త్‌డే రోజున టీజ‌ర్‌తో ట్రీటిస్తార‌ట‌!
బ‌ర్త్‌డే రోజున టీజ‌ర్‌తో ట్రీటిస్తార‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ఇండ‌స్ట్రీ వేడెక్కింది. తీరిగి నాగ‌బాబు కౌంట‌ర్ ఇవ్వ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వివాదం ఓ రేంజ్‌కి వెళ్లింది. ఇదిలా వుంటే ఈ నెల 10న నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా త‌న తాజా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌య్యే వెల్ల‌డించ‌డం విశేషం. అయితే బోయ‌పాటి మాత్రం ఏకంగా టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.  మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్ చిత్రాల త‌రువాత బాల‌య్య‌, బోయ‌పాటి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడ చిత్రం కావ‌డం, ఇద్ద‌రికీ ఈ స‌మ‌యంలో భారీ హిట్ సినిమా అవ‌స‌రం వుండ‌టంతో ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తినెల‌కొంది. పైగా ఇందులో బాల‌య్య తొలిసారి అఘోరాగా క‌నిపించ‌నుండ‌టం కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

ఇప్ప‌టికే ఓ కీల‌క షెడ్యూల్‌ని పూర్తి చేసిన ఈ చిత్రం కోసం `మోనార్క్‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు కూడా. ఇదే టైటిల్‌ని, ఫ‌స్ట్‌లుక్‌ని కూడా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవ‌రీనీ ఇప్ప‌టి వ‌ర‌కు ఫైన‌లైజ్ చేయ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All