Homeగాసిప్స్బాబాయ్, అబ్బాయ్ కలిసి మలయాళ రీమేక్ చేస్తారా?

బాబాయ్, అబ్బాయ్ కలిసి మలయాళ రీమేక్ చేస్తారా?

బాబాయ్, అబ్బాయ్ కలిసి మలయాళ రీమేక్ చేస్తారా?
బాబాయ్, అబ్బాయ్ కలిసి మలయాళ రీమేక్ చేస్తారా?

ఏ నిమిషాన సితార ఎంటర్టైన్మెంట్స్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కొశియుమ్‌ చిత్ర రీమేక్ రైట్స్ ను కొన్నారో కానీ అప్పటినుండి ఈ చిత్ర తెలుగు వెర్షన్ పై ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయ్యప్పనుమ్‌ కొశియుమ్‌ ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. పృథ్వీరాజ్, బిజూ మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వీరి పాత్రలే ముఖ్యమైనవి. వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువుపట్టు. కమర్షియల్ గా కూడా మంచి హై ను ఇస్తాయి ఈ పాత్రలు.

సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రేమమ్ తర్వాత మరో మలయాళ రీమేక్ ను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. నిన్ననే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో బిజూ మీనన్ పాత్ర బాలకృష్ణకు సరిగ్గా సరిపోతుందని అందరూ అనుకున్నారు. బాలకృష్ణ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లే వార్తలు వచ్చాయి. ఇక ఈరోజు దానికి ఇంకొంత మసాలా యాడ్ చేసే వార్త ఒకటి వచ్చింది.

- Advertisement -

నందమూరి బాలకృష్ణ – నందమూరి కళ్యాణ్ రామ్ ఈ రెండు పాత్రలను చేయబోతున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హెడ్ సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ప్రస్తుతం సితార సంస్థలో పలు చిత్రాలు నిర్మితమవుతున్నాయ్. అయితే ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో దృష్టాంతా ఈ మలయాళ రీమేక్ పై పడింది. గ్రౌండ్ వర్క్ అంతా ఈ ఖాళీ సమయంలో చేసుకుంటే వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే ఇంకా బాలకృష్ణకు, కళ్యాణ్ రామ్ కు ఈ విషయం గురించి సంప్రదించనే లేదు.

ప్రస్తుతం బాబాయ్, అబ్బాయి ఇద్దరూ ప్లాపులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి సినిమా చేస్తే అది కచ్చితంగా చిత్రానికి ప్లస్ అవుతుంది. మరి ఈ హీరోలు ఇద్దరూ ఏమనుకుంటున్నారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All