Homeటాప్ స్టోరీస్కళ్యాణ్ రామ్ కున్న ప్రధాన అడ్డంకి ఇదే!

కళ్యాణ్ రామ్ కున్న ప్రధాన అడ్డంకి ఇదే!

కళ్యాణ్ రామ్ కున్న ప్రధాన అడ్డంకి ఇదే!
కళ్యాణ్ రామ్ కున్న ప్రధాన అడ్డంకి ఇదే!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ఎంత మంచివాడవురా ఈ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెల్సిందే. పెద్ద సినిమాల మధ్య జనవరి 15న ఎంత మంచివాడవురా రిలీజవుతోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్న సంగతి తెల్సిందే. సంక్రాంతికి సాధారణంగా పెద్ద సినిమాలు సందడి చేస్తాయి కానీ అదే సంక్రాంతికి ప్రతిసారి ఒక చిన్న సినిమా లేక ఏ మాత్రం హడావిడి లేని ఒక మీడియం బడ్జెట్ సినిమా వచ్చి పెద్ద హిట్ కొడుతుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రెండ్ నడుస్తోంది. 2016లో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూసాం. అలాగే 2017లో శతమానం భవతి కూడా అలాగే సెన్సేషనల్ హిట్ అయింది. మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ను పూర్తిగా ఉపయోగించుకుని సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక గతేడాది వచ్చిన ఎఫ్ 2 కూడా ఇంతే. ఈ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.

ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు బాగా ఆడతాయి. ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ తన చిత్రం ఎంత మంచివాడవురాను జనవరి 15న దించుతున్నాడు. చాలా కూల్ గా సాగిపోయే ఒక రెఫ్రెషింగ్ సినిమాగా ఇది ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా చూస్తుంటే పాజిటివ్ గానే ఉంది. పైగా శతమానం భవతి వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాకు డైరెక్టర్ అయిన సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో అంచనాలు కూడా బాగున్నాయి.

- Advertisement -

ఈసారి సంక్రాంతి పోటీ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. బరిలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు నిలవడం దీనికి ప్రధాన కారణం. అలాగే తన సినిమాకు కూడా ఈ సంక్రాంతి మంచి అవకాశమని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. అయితే ఈ నందమూరి హీరో తన కెరీర్ లో ఇప్పటివరకూ ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలే చేసాడు. ఫ్యామిలీ సినిమాలు చాలా తక్కువ. అదొక్కటే సినిమాకు అడ్డంకిగా మారే అవకాశముంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ను తన మాస్ ఇమేజ్ తో ఇంప్రెస్ చేయగలడా లేదా అన్నది చూడాలి. అయినా కళ్యాణ్ రామ్ లుక్ అదీ బాగుంది. టీజర్ లో కూడా ఇంప్రెస్ చేసాడు. సో కళ్యాణ్ రామ్ మరొక హిట్ కొడతాడని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All