Homeటాప్ స్టోరీస్బాలయ్య - బోయపాటి సినిమాలో హైలైట్ అంశాలు అవే!

బాలయ్య – బోయపాటి సినిమాలో హైలైట్ అంశాలు అవే!

బాలయ్య - బోయపాటి సినిమాలో హైలైట్ అంశాలు అవే!
బాలయ్య – బోయపాటి సినిమాలో హైలైట్ అంశాలు అవే!

బోయపాటి శ్రీను సినిమాలు అనగానే మనకు గుర్తొచ్చేది కచ్చితంగా యాక్షనే. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటి శ్రీను యాక్షన్ అండ్ ఎమోషన్స్ ప్రధానంగా సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్నారు. హీరోకు కానీ లేదా హీరోకు కావాల్సిన వాళ్లకు అన్యాయం జరగడం, దానికి హీరో ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ బోయపాటి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసన్న పేరున్న బోయపాటి, గత సినిమా వినయ విధేయ రామ విషయంలో బాగా దెబ్బతిన్నాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడమే కాకుండా బోయపాటి ఇమేజ్ కు చాలా డ్యామేజ్ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే దెబ్బ తిన్న ప్రతిసారీ బోయపాటి తనను తాను కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమాలో కూడా అదే చేయనున్నాడు.

విలన్లు, రౌడీలు గాల్లోకి ఎగరడం, హీరో ఎంతమందినైనా ఎదిరించేయడం వంటివి బోయపాటి సినిమాల్లో మనం చూస్తుంటాం. అయితే ఈసారి అలాంటివేం లేకుండా రియలిస్టిక్ యాక్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బాలయ్య – బోయపాటి చిత్రంలో కూడా యాక్షన్ ఉన్నా కానీ అది నమ్మేలాగే ఉంటుందని, యాక్షన్ కోసం చాలా కసరత్తు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా కరోనా వైరస్ ప్రభావం కారణంగా బ్రేక్ పడింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసారు. రెండో షెడ్యూల్ పరిస్థితులు నార్మల్ అయ్యాక రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత.

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ లుక్ పై ఇప్పటికే అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపిస్తాడన్న వార్త ఫ్యాన్స్ ను ఉత్తేజానికి గురి చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All