Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ లో Game Changer మూవీ “బాలా”

బాలీవుడ్ లో Game Changer మూవీ “బాలా”

bala movie review telugu
bala movie review telugu

ప్రపంచంలో పోతే తిరిగి రాని వస్తువులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి సెల్ ఫోను, గర్ల్ ఫ్రెండ్ వీటితోపాటు అబ్బాయిలకు నెత్తి మీద ఉండే జుట్టు.  అసలు జుట్టు అనేది బలే క్రేజీ మేటర్. అవసరం లేని చోట గాలి, వెలుతురు లేకపోయినా పెరుగుతూ పోతుంది. అవసరం ఉన్న చోట గాలి తగులుతూ, ఎండ తగులుతూ, నూనె – షాంపూ లాంటి ఎరువులు వేసి పెంచుతున్నా కూడా తొందరగా పెరగదు.

 అసలు ఈ బొచ్చు గురించి డిస్కషన్ దేనికంటే,  ఈరోజు బాలీవుడ్ లో రిలీజ్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ బాలా.  ఇందులో నటించిన హీరో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకునే ఆయుష్మాన్ ఖురానా.

- Advertisement -

 రొటీన్ కు  భిన్నంగా విక్కీడోనర్ లాంటి సంచలనాత్మకమైన సినిమాని ఎంచుకొని ఆ తర్వాత కూడా “దమ్ లగా కే హైసా”, “బరైలీ కీ బర్ఫీ”, బదాయి హో  ఇలాంటి డిఫరెంట్ సినిమాల తో తన ఇమేజ్ ను బాలీవుడ్ లో  పెంచుకున్నాడు.

గత సంవత్సరం రిలీజ్ అయిన “అంధాదున్” సినిమా అయితే  అటు టాక్ పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. కళ్ళు లేని పియానో సంగీతకారుడిగా ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా నటన  next లెవెల్ లో ఉంటుంది.

 ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుత చిత్రం బాల.  యవ్వనంలోనే జుట్టు ఊడిపోయి బట్టతల తో బాధపడే ఒక కుర్రాడి క్యారెక్టర్ లో  ఆయుష్మాన్ ఖురానా ఒదిగిపోయాడు.  ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించడం తోపాటు,  రంగు, రూపం పరంగా  మాత్రమే ఎదుటి వ్యక్తులకు విలువనిచ్చే ప్రస్తుత సమాజ పరిస్థితులపై ఎంతో గంభీరమైన ఆలోచనలు మనకు కలగజేస్తుంది. పని ఒత్తిడి,  సరైన పోషకాహారం లేకపోవడం,  కాలుష్యం వంటి కారణాలతో ఇప్పుడు చాలామందికి యుక్తవయసులోనే బట్టతల సమస్య వేధిస్తోంది.

 ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా సరసన భూమి పెడ్నేకర్,  యామి గౌతమ్ నటించారు.  యామి గౌతమ్ సినిమాలో విగ్గు పెట్టుకొని నటించడం విశేషం.  “స్త్రీ” అనే సినిమాతో తనకంటూ ప్రత్యేకత తెచ్చుకున్న దర్శకుడు అమర్ కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

 కొసమెరుపు ఏంటంటే,  కన్నడంలో ఇలాంటి  అంశంతో ఆల్రెడీ  2017 లోనే సినిమా వచ్చింది.  దాని పేరు “ఒండు మొట్టేయ కథే”.  ఇప్పటి దాకా చూడని వాళ్ళు తప్పకుండా ఆ సినిమా చూడండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All