
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన నరౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `తలైవి`. పురుచ్చితలైవి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. విష్ణు వర్థన్ ఇంరూని, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ రోజు ఎం.జి.రామచంద్రన్ (ఎంజిఆర్) వర్ధంతి సందర్భంగా `తలైవి` మేకర్స్ అరవింద్ స్వామి ఎంజిఆర్ లుక్ కొత్త స్టిల్స్‌ని గురువారం విడుదల చేశారు. తన పార్టీ సభ్యులకు అభివాదం చేస్తున్నట్టు కనిపిస్తున్న అరవింద్ స్వామి లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేకర్స్ రిలీజ్ చేసిన స్టిల్స్‌లో
వైట్ షర్ట్.. వైట్ లుంగీ.. ఎంజీఆర్ ట్రేడ్ మార్క్ బ్లాక్ షేడ్ గాగుల్స్ ధరించి ముమ్మూర్తుల ఎంజీఆర్‌ని తలపిస్తున్న అరవింద్ స్వామి స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి.
అరవిందస్వామి బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ, ఉక్ పరంగా చాలా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలిన ప్లాన్ చేస్తున్నారు.