
ఇటీవల ఇటీవల బాలీవుడ్ లో హీరోలతో పాటు సమానంగా హీరోయిన్ల సినిమాలను కూడా ఆదరిస్తున్నారు సినీ ప్రేక్షకులు. హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా పోరాట దృశ్యాలు,ఎమోషనల్ సీన్లు చేస్తూ.. సినిమా సినిమాకు తమ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. నానాటికీ పెరిగిపోతున్న హీరోల డామినేషన్ తగ్గించడానికి కొంతమంది క్రియేటివ్ గా ఆలోచించి ఇలాంటి సమాంతర వ్యవస్థను సృష్టించిన పరిస్థితి ఇప్పుడు మనకు అర్థమవుతుంది.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన తాజా సినిమా “పంగా” తో ఈ ఏడాది మొదట్లోనే హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా అంగీకరించారు. ఈ సినిమాకు ప్రస్తుతం “తేజస్” అనే టైటిల్ అనుకుంటున్నారు. డైరెక్టర్ సర్వేష్ మరియు ప్రొడ్యూసర్ రోనీ స్క్రూవాలా కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమా, యుద్ధ నేపథ్యంలో ఉంటుందని.. అదేవిధంగా కం కంగనా రనౌత్ ఈ సినిమాలో పైలట్ గా కనిపించనున్నారని సమాచారం.
ఈ సమాచారాన్ని ధృవీకరిస్తూ, “దేశం ప్రజల రక్షణ కోసం త్యాగాలు చేసే ఒక సోల్జర్ క్యారెక్టర్ లో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.! ఇప్పుడు తలైవి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాను. త్వరలోనే మా డైరెక్టర్ సర్వేష్ సర్ గేమ్ లో జాయిన్ అవుతాను. సైనికుల హీరోయిజాన్ని వెండితెరపై సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన మా టీం కు నా ప్రత్యేక ధన్యవాదాలు.” అని కంగనారనౌత్ తన ఆనందాన్ని తెలియజేశారు.
ఇక తన అభిమాన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అనీ, విపత్కర పరిస్థితులను అభినందన్ హ్యాండిల్ చేసే విధానం ఆయనను నిజమైన హీరోను చేసిందని కంగనా తెలియజేశారు.