Homeటాప్ స్టోరీస్పాలిటిక్స్‌పై యాక్షన్ కింగ్ కామెంట్స్‌!

పాలిటిక్స్‌పై యాక్షన్ కింగ్ కామెంట్స్‌!

పాలిటిక్స్‌పై యాక్షన్ కింగ్ కామెంట్స్‌!
పాలిటిక్స్‌పై యాక్షన్ కింగ్ కామెంట్స్‌!

గ‌త కొంత కాలంగా సినీ స్టార్స్ రాజ‌కీయాల్లో రాణించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు కానీ ఎవ‌రూ ఆ స్థాయిలో రాణించ‌లేక‌పోతున్నారు. ఇటీవ‌ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయారు. ఇక త‌మిళ‌నాడు నుంచి క‌మ‌ల్‌హాస‌న్ క్రియాశీల రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్ నేను సైతం అంటూ గ‌త కొంత కాలంగా ఊరిస్తూ ఆరోగ్య కార‌ణాల దృష్ట్యా రాజ‌కీయ ఎంట్రీకి బ్రేకేశారు. ఇదిలా వుంటే హీరో యాక్ష‌న్ కింగ్ అర్జున్ రాజ‌కీయాల‌పై తాజాగా కామెంట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న సోద‌రి త‌న‌యుడు ధృవ్ స‌ర్జా హీరోగా న‌టించిన క‌న్న‌డ చిత్రం `సెమి తిమిరు`. ఈ చిత్రాన్ని `పొగ‌రు` పేరుతో  తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

ఈ మూవీకి సంబంధించిన ఓ కార్య‌క్ర‌మం చెన్నైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అర్జున్ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. నాకు న‌చ్చిన సినిమా రంగంలో చాలా సంతోషంగా వున్నాను. రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌స్తార‌ని అంతా అడుగుతున్నారు. నిజానికి రాజ‌కీయాల‌కు నేను అస్స‌లు ప‌నికిరాను. ఆ తెలివి తేట‌లు నాకు లేవు. `ఒకే ఒక్క‌డు` సినిమాలో మాదిరిగా సీఎంగా మారి ఆ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేయ‌డం సాధ్యం కాని ప‌ని. అలా ఎవ‌రూ చేయ‌లేర‌న్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All