Homeటాప్ స్టోరీస్అరవింద సమేత టీజర్ ఎప్పుడో తెలుసా

అరవింద సమేత టీజర్ ఎప్పుడో తెలుసా

aravinda sametha gets teaser release dateయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం ” అరవింద సమేత వీర రాఘవ ” . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు కాగా ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు చిత్ర బృందం . ఇంతకీ టీజర్ ఎప్పుడు విడుదల చేయాలనీ అనుకుంటున్నారో తెలుసా ….. …… ఆగస్టు 15 న . స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న అరవింద సమేత టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకులు త్రివిక్రమ్ . నాగబాబు – జగపతిబాబు లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది అలాగే ఈషా రెబ్బా కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడం , ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కావడంతో రికార్డుల మోత మోగడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు .

- Advertisement -

ప్రస్తుతం హైదరాబాద్ లో కాలేజ్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది అరవింద సమేత చిత్రం . ఎన్టీఆర్ ని కత్తి పట్టించిన త్రివిక్రమ్ ఈ షెడ్యూల్ లో మాత్రం పువ్వులు పట్టుకుంటూ అమ్మాయిల చుట్టూ తిరిగే వాడిలా చూపిస్తున్నాడు . ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: aravinda sametha gets teaser release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All