Homeటాప్ స్టోరీస్జూనియర్ ఎన్టీఆర్ రెండో కొడుకు పేరు ఇదే

జూనియర్ ఎన్టీఆర్ రెండో కొడుకు పేరు ఇదే

jr. ntr reveals the name of his younger sonయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటీవలే రెండో కొడుకు పుట్టిన విషయం తెలిసిందే . కాగా ఈరోజు ఆ రెండో కొడుక్కి నామకరణం చేసారు ఇంతకీ ఎన్టీఆర్లక్ష్మీ ప్రణతి ల రెండో కొడుకు పేరు ఏంటో తెలుసా …….. ” భార్గవ రామ్ ” . మొదటి కొడుకు పేరు ” అభయ్ రామ్ ” కాగా రెండో కొడుక్కి భార్గవ రామ్ అని పెట్టడం విశేషం . రెండు పేర్లలో కూడా తాతయ్య పేరు వచ్చేలా చూసుకొని మరీ పెట్టాడు ఎన్టీఆర్ . ఈరోజు నామకరణం కావడంతో తన ఇద్దరు పిల్లలు , భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి దిగిన ఫోటో ని ట్వీట్ చేసాడు ఎన్టీఆర్ . ఇప్పుడా ఫోటో నెట్ లో వైరల్ అవ్వడం ఖాయం .

ఎన్టీఆర్ రెండో తనయుడి విశేషాలతో ఈరోజు నందమూరి తారకరామారావు ఇంట సందడే సందడి . నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తున్న సమయంలో మొదటిసారిగా తండ్రి అయ్యాడు ఎన్టీఆర్ , కాగా ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న సమయంలో రెండో కొడుకు పుట్టాడు . ఇద్దరు రామ్ లతో ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నాడు .

- Advertisement -

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు . ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా తాజా వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవ్వడం ఖాయం .

English Title: jr. ntr reveals the name of his younger son

The little one is, #BhargavaRam #NamingCeremony #FamilyTime #Bratpack

A post shared by Jr NTR (@jrntr) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All