Friday, March 24, 2023
Homeటాప్ స్టోరీస్అరవింద సమేత అఫీషియల్ అనౌన్స్ మెంట్

అరవింద సమేత అఫీషియల్ అనౌన్స్ మెంట్

Aravinda sametha gets official release dateఅరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేస్తున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు ఆ చిత్ర బృందం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది , మరోవైపున పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాంతో అక్టోబర్11న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటించగా ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించింది.

- Advertisement -

జగపతిబాబు, నాగబాబు లతో పాటుగా సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అరవింద సమేత పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ , ట్రైలర్ లతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస విజయాలు సాధిస్తున్న ఎన్టీఆర్ కు అరవింద సమేత కూడా భారీ విజయాన్ని ఇవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ , ట్రైలర్ తో ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయ్యారు ఇక సినిమా విజయదశమి కానుకగా వస్తుండటంతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని నమ్ముతున్నారు. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English Title: Aravinda sametha gets official release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts