Homeటాప్ స్టోరీస్అరవింద సమేత ఫైట్ సీన్ లీక్

అరవింద సమేత ఫైట్ సీన్ లీక్

Aravinda sametha fight scene leakedఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ఫైటింగ్ సీన్ అది కూడా కీలకమైన సీన్ లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే పలు స్టిల్స్ అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి సంబంధించి లీకులు కాగా తాజాగా జరిగిన లీక్ తో ఆ చిత్ర బృందం నివ్వెరపోయింది . ఎన్టీఆర్ ని , అతడి కుటుంబాన్ని చంపడానికి చేసే ప్రయత్నంలో తండ్రిగా నటిస్తున్న నాగబాబు చనిపోయే సీన్ తాలూకు ఫైట్ సీన్ ఇది . రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఫైట్ లీక్ కావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఇబ్బంది పడుతున్నారు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా నాగబాబు , జగపతిబాబు , ఈషా రెబ్బా, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు . ఇప్పటికే ఎస్ ఎస్ తమన్ అందించిన పాటలపట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలా సీన్లు లీక్ అవుతుంటే అరవింద సమేత వీర రాఘవ చిత్రం కు నష్టం జరగడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి . మరి ఆ అంచనాలను అరవింద సమేత అందుకుంటుందా చూడాలి .

- Advertisement -

English Title: Aravinda sametha fight scene leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All