Homeటాప్ స్టోరీస్రానాను బ్రో అంటూ అనుష్క షాకింగ్ ట్వీట్

రానాను బ్రో అంటూ అనుష్క షాకింగ్ ట్వీట్

రానాను బ్రో అంటూ అనుష్క షాకింగ్ ట్వీట్
రానాను బ్రో అంటూ అనుష్క షాకింగ్ ట్వీట్

దగ్గుపాటి రానా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి పుష్కర కాలం పూర్తి కావడం తో సోషల్ మీడియా లో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విషెష్ అందిస్తున్నారు. ఎవరి స్టయిల్ లో వారు విష్ చేయగా..బాహుబలి ఫేమ్ అనుష్క మాత్రం సింపుల్ గా గ్రేట్ గోయింగ్ బ్రో అంటూ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. రానా పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు.

ఆ ట్వీట్ లో.. 12 ఏళ్లు ముగించుకోవడం అద్బుతంగా అనిపిస్తుంది. మీ అందరి యొక్క శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. అర్జున్ ప్రసాద్ నుండి డానియల్ శంకర్ వరకు మద్యలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృజ్ఞతలు. ఇలాగే నన్ను ముందు ముందు కూడా ఆధరిస్తారని.. నన్ను కొత్తగా చూపిస్తారని కోరుకుంటున్నాను అంటూ రానా ట్వీట్ చేసాడు.

- Advertisement -

ఈ ట్వీట్ కు పలువురు పలు విధాలుగా స్పదించగా..అనుష్క మాత్రం సింపుల్ గా గ్రేట్ గోయింగ్ బ్రో అంటూ రీ ట్వీట్ చేసింది. అనుష్క నిజంగా రానాతో ఒక సోదరుడి భావంను కలిగి ఉంటాను అన్నట్లుగా పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రానా కూడా అనుష్క పై చాలా సందర్బాల్లో తన అభిమానంను చూపించారు. అందుకే ఇలా అనుష్క ట్వీట్ చేసి ఉంటుందని అంత మాట్లాడుకుంటున్నారు.

ఇక రానా సినిమాల విషయానికి వస్తే..పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ మూవీ లో నటించారు. ఇందులో విలన్ రోల్ లో నటించాడు. సాగర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All