Homeటాప్ స్టోరీస్పాత సినిమాలలోని పాత్రలు ఇప్పుడు కొంచెం కొత్తగా

పాత సినిమాలలోని పాత్రలు ఇప్పుడు కొంచెం కొత్తగా

Anushka Shetty Nishabdham
Anushka Shetty Nishabdham

స్వీటీ అనుష్క శెట్టి ‘భాగమతి’ సినిమా తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్దం’. సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా ‘ఝాన్సీ లక్ష్మి భాయి’ పాత్ర చేసిన అనుష్కకి ఆ సినిమా కూడా మంచి పేరునే తెచ్చి పెట్టింది. సైరా సినిమా మొదలు అయిన వెంటనే ఇలా తన పాత్ర చూపిస్తున్నందుకు చాలా సంతోషం అని ట్విట్టర్ ద్వారా సినిమా యూనిట్ వాళ్ళకి కృతజ్ఞతలు  చెప్పింది.

ఇక నిశ్శబ్దం సినిమా దగ్గరికి వస్తే….నిశ్శబ్దం అనే మాటలోనే అర్ధం అవుతుంది సినిమాలో అనుష్క పాత్ర మాట్లాడలేని ఒక కళాకారిణి గా పెయింటింగ్ వేస్తూ ఉంది అని.అయితే ఈ రోజు సినిమాలోని ఇంకొక పాత్ర ‘మాధవన్’ గారి ఫస్ట్ లుక్ రేపు విజయదశమి కానుకగా విడుదల చేసారు. ఇందులో మాధవన్ గారు వైలిన్ వాయిస్తూ కనిపిస్తున్న ఆ పోస్టర్ లో తాను అంధుడుగా నటిస్తున్నాడు అని అర్ధం అయిపోతుంది. మరి అనుష్క మూగ, మాధవన్ అంధుడి క్యారెక్టర్లు చూస్తుంటే మీకేమైనా సినిమా గుర్తొచ్చిందా?

- Advertisement -

నాకైతే కళాతపస్వి కె.విశ్వనాధ్ గారి సిరివెన్నెల సినిమా మదిలోకి వచ్చింది. ఆ సినిమాలో కూడా సుహాసిని గారు మూగ వారీగా నటిస్తే, సర్వధానం బనెర్జీ గొప్ప సంగీత విద్వంసుడిగా పాటలు పడుతూ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కనిపిస్తారు.

మరి ఆ సినిమా, ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే క్యారెక్టర్లు ఒకటే అయినా కూడా అనుష్క గారు కథ ఒప్పుకున్నారంటేనే ఇంకా మనకి సినిమాలో  ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయి అని అర్ధం అయిపోతుంది. సినిమాని టి.జి విశ్వప్రసాద్ మరియు కోన వెంకట్ గారు నిర్మిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All